మూసాపేట/నవాబ్‌పేట/కల్వకుర్తి/వెల్దండ/హన్వాడ/మరికల్, ఏప్రిల్ 15 : వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. వ్యయప్రయాసాలకోర్చి సాగు చేసిన పంటలు నీటిపాలయ్యాయి. ఉమ్మడి పాలమూరులో మంగళవారం సాయంత్రం వడగండ్లతో భారీ వర్షం కురిసింది. దీంతో వరిపంటలు నేలకొరగగా, మామిడి రాలిపోయింది. జొన్న, మొక్కజొన్న ఇతర పంటల రైతులు నిండా మునిగారు. ఇప్పటికే వరికోతలు కోసి ఒడ్లు ఆరబెట్టగా, అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దయ్యింది.
ధాన్యాన్ని పంటలను కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు, పరుగులు పెట్టినా ఎలాం టి ప్రయోజనం లేకపోయింది. మూసాపేట, అడ్డాకుల మండ లాల్లో వరి ధాన్యం వరద పా లైంది. మూసాపేటతోపాటు వే ముల, కొమిరెడిరెడ్డిపల్లి, దాసరి పల్లి, తుంకినీపూర్, జానంపేట తదితర గ్రామల్లో ధాన్యం తడిసి పోయింది. వేములకు చెందిన వెంకటయ్య అనే రైతు ఎనిమిది ఎకరాల్లో వరి సాగుచేయగా, కోతకోసి ఆర బెట్టాడు. అధికారులు ధాన్యం కొనకపోవడంతో అకాల వర్షా నికి ధాన్యం కోట్టుకుపోయి నష్టం మిగిలింది.
మూసాపేట మండ లం వేములకు చెందిన అయ్యమ్మ(50) తన పొలంలో కోసిన వరిధాన్యాన్ని గ్రామ శివారులోని కోజెంట్ పరిశ్రమ వద్ద ఉన్న రోడ్డుపై ఆరబోయగా, ఈదురుగాలులతో కూడా వర్షం రా వడంతో సమీపంలో ఉన్న రేకులడబ్బా గాలికి కొట్టుకొచ్చి అమెపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు, మూసాపేట తాసీల్దార్ రాజు విచారణ చేపట్టారు. నవాబ్‌పేట మండలంలోని రుద్రారం, కొండాపూర్, చాకలిపల్లి, కేశవరావుపల్లి, బట్టోని పల్లితండా తదితర గ్రామాల్లో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది.
రుద్రారంలో 70ఎకరాలు, కొండాపూర్‌లో 40, చాకలిపల్లిలో 50, కేశవరావు పల్లిలో 30, బట్టోనిపల్లితండాల్లో 40 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. పలు గ్రా మాల్లో చెట్లు విరిగి కరెంట్ వైర్లపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కల్వకుర్తి మండలం తాండ్ర రెవెన్యూ గ్రామ పరిధిలో వరిపంటలు దెబ్బతిన్నాయి.
ఆకుతోట బావి, మర్రిగడ్డ, మేరోనిగడ్డ, నక్కరి చెరువు వద్ద కురిసిన వడగవడ్ల వర్షానికి 80ఎకరాల్లో పంటకు నష్టం చేకూరింది. వెల్దండ మండలంలో ఈ దురుగాలులుతో కురిసిన వర్షానికి మా మిడి కాయలు నేలరాలగా, బండోన్పల్లి, కొట్రలో వడ గండ్ల వానతో ధా న్యం నేలపాలైంది. బండోన్పల్లిలో 36 ఎక రాల్లో వరి పంట నష్టం జరిగింది. వెల్దండలో రైతు గణేశ్ కు మామిడి రైతు తోటలో మామిడికాయలు పూర్తిగా నేలరా లాయి. అధికారులు దెబ్బతిన్న వరిపంటలను పరిశీలించారు.
హన్వాడ మండలం దాచక్పల్లికి చెందిన వడ్డె మాసయ్య పొలం వద్ద గేదెలను కట్టెసి ఉంచగా, పిడుగుపడి రెండు గేదెలు అక్కడిక్కడే మృతి చెందాయి. టంకరలో ఈదురుగాలులకు చెట్లు విరిగి వైర్లపై పడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరికల్ మండల కేంద్రంలో ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీకి విద్యుత్ వైర్లు తగిలి వైర్లు తెగిపడ్డాయి. లారీపై ఉన్న ఇద్దరు వెంటనే కిందకు దూకడంతో పెనుప్రమాదం తప్పింది.