జడ్చర్ల, జనవరి 7 : కొత్త కొత్త ఆలోచనలతోనే వినూత్న ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వీటిని గుర్తించి ప్రోత్సహించేది తల్లిదండ్రులతోపాటు గురువులేనన్నారు. పిల్లల్లో టాలెంట్‌ను గుర్తించేది వారే అని తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేఎం ఇంటర్నేషనల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చిన 861 ప్రదర్శనలు వచ్చినట్లు వి వరించారు.
ప్రదర్శనలను మంత్రి తిలకించి వారి ఆవిష్కరణల గురించి విద్యార్థులను అడి గి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకను ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో పోటీతత్వం ఉం డాలని, ఆలోచన, ఆచరణ, అన్వేషణ మూడు ముఖ్యమైనవని, విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టి జాతీయస్థాయిలో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రతిఒక్క విద్యార్థిని, విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ఆవిష్కరణలు తనను ఎంతో అబ్బుర పరిచాయన్నారు. ప్రభుత్వం వైద్య, విద్యా రంగాలకు పెద్దపీట వేసిందని తెలిపారు.
ప్రతి పాఠశాలలోనూ సైన్స్ ప్రయోగశాలలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, కలెక్టర్ విజయేందిరబోయి మాట్లాడుతూ పాఠశాలలో ప్రయోగశాలలు ఉండాలని అన్నారు. ప్రదర్శనలు తిలకించేందుకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమ ంలో ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీహరి, ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ శి వేంద్రప్రతాప్, డీఈవో ప్రవీణ్‌కుమార్‌తోపాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.