అచ్చంపేట రూరల్ : ఉపాధి కూలీల వేతన బకాయిలు విడుదల చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం మే 30న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరపత్రాలను సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడె ఎల్ దేశ నాయక్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతల నాగరాజు, అచ్చంపేట మండల కార్యదర్శి వర్ధన్ సైదులు , పట్టణ కార్యదర్శి రాములు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సైదులు, హుస్సేన్ కరపత్రాలను విడుదల చేశారు. పట్టణ పేదలకు ఉపాధి కల్పించాలని.. రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలని.. ఏడాదిలో 200 పని దినాలు కల్పించాలని కోరారు.