కల్వకుర్తి రూరల్, జూలై 26 : రఘుపతిపేట గ్రా మ సమీపంలోని దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కల్వకుర్తి మం డలం రఘుపతిపేట ప్రధాన రహదారిపై సీపీఎం, ఆయా సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిడ్జి మంజూరై ఏండ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదన్నారు.
వానకాలంలో నది ఉధృతంగా ప్రవహించడంతో కల్వకుర్తి, తెల్కపల్లి మండలాలకు రాకపోకలు నిలిచిపోతాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని పనులను వేగంగా ప్రారంభింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఆంజనేయులు, బాల్రెడ్డి, పరశురాములు, అశోక్, లక్ష్మయ్య, రఘుపతిపేట గ్రామస్తు లు అంజయ్యగౌడ్, భీమయ్య, మల్లేశ్, ఇదమ య్య, శంకర్, శేఖర్ తదితరులు ఉన్నారు.