నాగర్కర్నూల్, ఆగస్టు 24 : పీఎం నరేంద్రమోదీ శతకోటీశ్వరులకు అమ్ముడుపోయారని, ఉక్కు నౌక, విమానాశ్రయాలు వంటి ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో సీపీఐ జిల్లా 2వ మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ అచ్చేదిన్కాదు సచ్చేదిన్ వచ్చాయని విమర్శించారు. ఆదానీకి ప్రభుత్వ సంస్థలను అమ్ము తూ కార్మిక హక్కులను కాలరాస్తున్నాడన్నారు. రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ ఆందోళన చేయడంతో 750 మంది రైతులు చనిపోయారని, అప్పుడు గానీ చట్టం వెనక్కి తీసుకోలేదన్నారు. విద్యుత్ చట్టం అమలైతే రైతులు వ్యవసా యం చేయడం కష్టంగా మారుతుందన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టడం సరికాదన్నారు. మీటర్లు బిగిస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
నీ ఆటలు ఇక సాగవన్నారు. పె ట్రోల్ రూ.110, సిలిండర్ ధర రూ.1150కి చేరిందన్నా రు. పెంచిన ధరలను చూస్తే దేశ పరిపాలన ఎటుపోతుందో అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం భిన్నత్వంలో ఏకత్వం మన విధానమని.., ఒక కులం, మతంపై పెత్తనం చేయొద్దన్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లలా కలిసి ఉంటున్నామ ని.., కానీ మోదీ పాలనలో ముస్లింలు, జర్నలిస్టు గౌరీలంకేశ్, సాయిబాబ, వరవరరావులాంటి అభ్యుదయవాదులపై దా డులు, రాజద్రోహ చట్టం మోపారన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ చట్టం ఎందుకు అన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. అడిగే వాళ్లు లేకుండా చేస్తున్నారని, దేశంలో సంపన్నవర్గాలకు సంపదను కట్టబెట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. మోదీ పాలనను వ్యతిరేకిస్తూ ప్రతి పౌరుడు ముందుకు రావాలన్నారు. ఉచితాలు, సంక్షేమాలు వద్దన డం సరికాదన్నారు. కార్పొరేట్ దిగ్గజాలు రూ.12 లక్షల కోట్లు ఎగ్గొడితే మాఫీ చేశారని, పేదలు అప్పులు చేస్తే బ్యాంకు అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో రజాకార్లతో పోరాడింది మనం కా దంటూ మోదీ పేర్కొనడం సిగ్గుచేటన్నారు. మోదీ విధానాలను ప్రస్తుతం బెంగాల్లో చూస్తున్నామని, వాళ్లు ఇక్కడ అధికారంలోకి వస్తే రైతుబంధు, రైతుబీమాలు రాకుండా పోతాయని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎ మ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శి బాల్నర్సింహ, వెంకటయ్య, ఫయాజ్, కేశవులుగౌడ్, నర్సింహ, ఏసయ్య, విజయుడు, చంద్రమౌళి, భ రత్ తదితరులు పాల్గొన్నారు.