అలంపూర్ చౌరస్తా, డిసెంబర్ 9 : విద్యార్థుల ఉపయోగించే బాత్రూంలు కంపు కొడుతున్నాయి.. భోజ నం నాణ్యత లేదు ఏం చేస్తున్నారు మీరు అని అలంపూర్ కోర్టు జడ్జి మిథన్ తేజ కస్తూర్బా బాలికల పాఠశాల సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. సోమవా రం సాయంత్రం 7గంటలకు అలంపూర్ పట్టణంలోని కస్తూర్బా పాఠశాలను న్యాయవాదులతో కలిసి ఆయ న తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలో భోజనాన్ని పరిశీలించగా రుచిగా లేకపోవడంతో రుచికరమైన భో జనం వడ్డించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు చదువుతోపాటు, న్యాణమైన భోజనం అందించాలని లే కపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే పాఠశాలలో విద్యార్థులు ఉపయోగించే బా త్రూంలను పరిశీలించారు. బా త్రూంలు అపరిశుభ్రంగా కంపువాసనతో ఉండడంతో ఇలా ఉంటే విద్యార్థులకు ఆనారోగ్య సమస్యలు తతెత్తుతాయని వీటి ని ప్రతి రోజూ శుభ్రంగా ఉంచాలని సూచించారు. పాఠశాలలో మెరుగైన విద్యతో పా టు న్యాణమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత మీపై ఉందని అక్కడి సిబ్బందికి హెచ్చరించారు. అనంతరం పాఠశాలలో రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తె లుసుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్‌కుమార్, న్యాయవాదులు రాజేశ్వరి, శ్రీధర్‌రెడ్డి, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్ ఉన్నారు.