చారకొండ, డిసెంబర్ 30 : పత్తిని కొనుగోలు చేయడం లేదని కర్షకన్న కన్నెర్ర చేశాడు. నాగర్కర్నూల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న తిరుమల కాటన్మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రం వద్ద వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని మండిపడ్డారు. సోమవారం చారకొండ మండలం మర్రిపల్లి సమీపంలో జడ్చర్ల-కోదాడ హైవేపైకి చేరిన రైతులు పత్తివాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు.
ఆరుగాలం కష్టించి పండించిన తెల్లబంగారాన్ని కొనుగోలు చేయకుండా నిలిపివేసి సీసీఐ, మార్కెటింగ్ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం పత్తి క్వింటాకు రూ.7,521, రూ.7,471, రూ.7,421 చొప్పున ప్రభుత్వం మ ద్దతు ధరను ప్రకటించిందన్నారు. కానీ తేమ, కాయ పేరుతో పూర్తిస్థాయిలో ధరను వేయకుండా సీసీఐ బయర్లు కొర్రీలు పెడుతున్నారని వాపోయా రు. ఏడు రోజులుగా పత్తితో ఇక్కడికి వచ్చామని, పత్తి తెచ్చిన వాహనాల కిరాయి పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలో వర్షాధారంపై ఆధారపడి ఎక్కువగా పత్తినే సాగు చేస్తుంటారని, కానీ ఈసారి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పండించిన కొంత పంటకైనా మద్ద తు ధర కోసం సీసీఐ కేంద్రానికి వస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. రైతుల ఆందోళనతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకొన్న ఎస్సై శంషొద్దీన్ అక్కడకు చేరుకొని మార్కెట్ కార్యదర్శి కిరణ్కు ఫోన్లో స మాచారమిచ్చాడు. కార్యదర్శితోపాటు సీసీఐ అధికారులు వచ్చి కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు.
మాది చారకొండ మండ లం సిరుసనగండ్ల గ్రామం. నేను నాలుగెకరాల్లో పత్తి పంటను సాగు చేశాను.. ది గుబడి రాగానే సీసీఐ కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు గత సోమవారం ఇక్కడికొచ్చాను. కిరాయి ట్రాక్టర్లో పత్తి తెచ్చా ను. కొనకపోవడంతో ఇక్కడే పడిగాపులు కాస్తు న్నా.. కిరాయి పెరిగిపోతుంది. ట్రాక్టర్ మిల్లు వద్ద నే పెట్టి రోజూ వచ్చి తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నా. అధికారులు స్పందించి కొనుగోలు చేయాలి.
– పశుల విష్ణు, రైతు, సిరుసనగండ్ల, చారకొండ
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని అమ్ముకుందామంటే అధికారులు లేనిపోని కొర్రీలు పెడుతున్నారు. కోటి ఆశలతో తెల్లబంగారాన్ని సీసీఐ కేంద్రానికి తీసుకొస్తే తేమ పేరుతో తక్కువ ధర కేటాయిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ఇవ్వడం లేదు. కనీసం తాము పెట్టిన పెట్టుబడులు కూడా రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి కొర్రీలు పెట్టకుండా పత్తిని కొనుగోలు చేసి ఆదుకోవాలి.
– లక్ష్మమ్మ, ఎర్రగుంటపల్లి, నల్లగొండ జిల్లా