మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 25 : పత్తి కొనుగోళ్లు చేయ కపోవడంతో రైతులు మూడు రోజులుగా అవస్థలు పడుతున్నా రు. అడ్డాకుల మండలంలోని ఎస్ఎస్వీ కాటన్ మిల్లు వద్ద ఏర్పా టు చేసిన కేంద్రానికి శనివారం రైతులు పత్తి లోడుతో వచ్చారు. అప్పటి నుంచి కొనుగోళ్లు చేయకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
మిల్లు వద్ద నుంచి జాతీయ రహదారిపై వాహనాలు బారులుదీరాయి. శుక్రవారం కొనుగోలు చేసిసాయంత్రం నుంచి నిలిపివేసినట్లు తెలిపారు. సోమవారం ఉద యం వరకు కొనుగోలు కేంద్రం తెరవకపోవడంతో అన్నదాతలు అక్కడే నిరీక్షిస్తున్నారు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు పడుతున్న తిప్పలు వర్ణణాతీతం.