అలంపూర్ చౌరస్తా, నవంబర్ 23 : భూ తల్లిని నమ్ముకుని జీవిస్తున్న రైతులపై రాజకీయం చేయొద్దని అధికార పార్టీ నాయకులకు ఎమ్మెల్యే విజయుడు సూచించారు. ఆ దివారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్‌యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆ యన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని చోట్లా పీఏసీసీఎస్ ద్వారా కొనుగోలు చేస్తుండగా ఇక్కడ మాత్రం ఏఎంసీ పరిధిలోకి తీసుకురావడం కక్ష సాధింపు చర్య అని అన్నారు. రైతులకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో కొనుగోలు చేయాలని కానీ మీ ఇష్టానూసారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. రైతులు లేకుంటే నేటి సమాజానికి తినడానికి తిండి లేదని, రైతులపై ప్రభుత్వాలు సానుకూలంగా ఉంటూ రైతులకు పండించిన పంటకు మద్దతు ధర లభించే విధంగా ప్రభుత్వం ఉండాలని పేర్కొన్నారు.
అలంపూర్ నియోజకవర్గ రైతులకు నేను అండగా ఉంటానని అన్నారు. ఓపెన్ షేడ్‌లో సీఎంఆర్ బి య్యం తొలగించాలని అక్కడే ఉన్న రైతులు ఎమ్మెల్యేకు సమస్య తెలుపగా ఆయన స్పందించి రెండెళ్లుగా షేడ్‌లో సీఎంఆర్ బియ్యాన్ని నిల్వ ఉంచారని నేడు మొక్కజొన్న రైతులు పంటను తీసుకోస్తే రైతులు ఎక్కడ పంటను నిల్వ ఉంచాలన్నారు. నిల్వ ఉంచిన బియ్యాన్ని తక్షణమే తరలించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మార్కెట్ అధికారులను అదేశించారు. ఉండవెల్లి, అలంపూర్ మండలాల్లో ఆర్డీఎస్ చివరి ఆయకట్టు కింద ఉ న్న పంటలు ఎండుతున్నాయని చివరి ఆ యకట్టుకు సాగునీటి విడుదల చేయాలని ఎమ్మెల్యేను రైతులు కోరగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఆర్డీఎస్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్‌తో సాగునీటిపై మాట్లాడానని, త్వరలోనే చివరి ఆయకట్టుకు సాగునీరు వస్తుందని అన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్, పీఏసీసీఎస్ చైర్మన్ గజేందర్‌రెడ్డి, జిల్లా మార్కెట్ అధాకారి పుష్పమ్మ, మార్కెట్మార్డ్ కార్యదర్శి ఏల్లస్వామి, అయిజ మండల బీఆర్ఎస్ ఇన్చార్జి వావిలాల రంగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు కిశోర్, నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.