అయిజ, నవంబర్ 2 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ను అమలు చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లే దని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్ల య్య స్పష్టం చేశారు. శనివారం పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్వీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా డీఎస్సీ వేస్తామని నమ్మించి అభ్యర్థులను నిండా ముంచిందని ఆరోపించారు. విద్యా భరోసా కింద రూ.5లక్షల కార్డును ఇస్తామని, అతీగతి లేకుండా కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పది పాసైతే రూ.10వేలు, ఇం టర్కు రూ.15వేలు, డిగ్రీకి రూ.20వేలు, పీజీకి రూ.50వేలు, పీహెచ్‌డీకి రూ.5లక్షలు ఇస్తామని గొప్పలు చెప్పి నేడు వాటి ఊసే లే దన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదన్నారు. విద్యారంగ సమస్యలపై పోరాటా లు చేస్తామన్నారు. సమావేశంలో నాయకు లు భరత్ బాబు, ఖాజావలి, సోమశేఖర్ నా యుడు, మత్తాలి, రాజు, మైబు, ఏలియా, పరశురాముడు, రామ్‌కుమార్, రవితేజ, సూ ర్య తదితరులు పాల్గొన్నారు.