అయిజ, నవంబర్ 10 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి మరోసారి అనుచిత వ్యా ఖ్యలు చేస్తే సహించమని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం అయిజ పట్టణంలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కుర్వ పల్లయ్య మాట్లాడుతూ .. నల్లగొండ స భలో మూసీకి అడ్డొస్తే ముక్కలు చేస్తా.. బుల్డోజర్లతో తొక్కిస్తా, మూసీలో పారేస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడటం చూ స్తుంటే తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు.
భవిష్యత్ తరానికి సీఎం ఏమి నేర్పుతున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఏ సీఎం ఇలాంటి చేత్త మాటలు మాట్లాడలేదన్నారు. ఆరు గ్యారెంటీలను అ మలు చేయకుండా, తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ పత్రికలు, టీవీల్లో తాను ఏదో తెలంగాణను ఉద్దరిస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ చేతగాని మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. సీఎం నోరు అదుపులో ఉంచుకోవాలని మరోసారి బీఆర్ఎస్ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో పోలీసులు జోక్యం చేసుకొని మంటలు అదుపు చేసేందుకు తీ వ్రంగా యత్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ మండల నాయకులు వీరేశ్, మత్తాలి, మైబు, రాజు, రంజిత్, రవితేజ పాల్గొన్నారు.