బాలానగర్ : ప్రభుత్వ సొమ్ము కదా అంటూ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. నాలుగు కాలాల పాటు పదిలంగా ఉండవలసిన రోడ్లు పదిరోజులు కూడా ఉండకపోవడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి, కాంట్రాక్టర్ల దోపిడీకి అద్దం పడుతుంది.
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ ( Bala Nagar ) మండలం బోడగుట్ట తండా గ్రామం పెద్దరేవల్లి నుంచి దేవునిగుట్ట తండా వరకు కిలోమీటర్ మేర ఆర్ అండ్ బీ ( R and B ) అధికారులు బీటీ రోడ్డు ( BT road ) వేశారు.
మట్టిపై డాంబర్ వేసి నాణ్యత లేని రోడ్లు వేస్తున్న కాంట్రాక్టర్లు
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం బోడగుట్ట తండా గ్రామం పెద్దరేవల్లి నుండి దేవునిగుట్ట తండా వరకు ఒక కిలోమీటర్ మేర ఆర్&బీ బీటీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్
కనీస ప్రమాణాలు పట్టించుకోకుండా మట్టిపై కేవలం డాంబర్ వేయడంతో… pic.twitter.com/m398llDBlx
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2025
సదరు కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్ కనీస ప్రమాణాలు పట్టించుకోకుండా మట్టిపై కేవలం డాంబర్ వేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. అనతికాలంలోనే రోడ్లు మరమ్మతులకు గురవుతూ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుందని, రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.