మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 7 : జీవో నెం.21 వెంటనే వెనక్కి తీసుకోవాలని పాలమూరు యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులు డిమాండ్ చేశారు. సోమవారం పీయూ పరిపాలన భవనం ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ జీవో ఉత్తర్వు జిరాక్స్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీల్లో సహాయ ఆచార్యుల నియామకం కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 21ను తక్షణమే రద్దు చేయాలన్నారు.
ఈ మేర కు వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేశ్‌బాబును కలి సి ఒప్పంద అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాకే మిగిలిన పోస్టులను నియమించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా యూనివర్సిటీని నమ్ముకొని పనిచేస్తున్నామని, జూనియక్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లను క్రమబద్ధీకరించినట్లే యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఒప్పంద అధ్యాపకుల సంఘం నాయకులు భూ మయ్య, రవికుమార్, శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వెంకటేశ్, కరుణాకర్‌రెడ్డి, రవికాంత్, విజయ్‌భాస్కర్, సోమేశ్వర్, శ్రీనివాస్, జంగం విశ్వనాథ్, బషీర్ అహ్మద్, ఆంజనేయులు పాల్గొన్నారు.