అచ్చంపేటటౌన్, డిసెంబర్ 9 : కాం గ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్లను రె గ్యులర్ చేయదు.. వారికి నెల నెలా జీ తాలివ్వదు.. దీంతో వారి బాధలు వర్ణణాతీతం. ఆరునెలలుగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు అందక అయోమయ స్థి తిలో ఉన్నారు. పాఠాలు బోధించే వారికి పస్తులు ఉంచే దౌర్భాగ్యపు స్థితి ఏర్పడిందని కాంట్రాక్ట్ లెక్చరర్లు వాపోతున్నారు. ప్రజా ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగు ల పరిస్థితి దీనస్థితికి దిగజార్చింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో జీవో నెం 16 ద్వా రా ఆరు వేల కాంట్రాక్ట్ ఉద్యోగులను రె గ్యులర్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
మిగిలిన వారిని కూడా రెగ్యులర్ చేసే సమయంలో ఎలక్షన్ కోడ్ రా వడంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు తరువాత చేయాలని నిర్ణయించింది. కానీ కాంగ్రెస్ ప్రభుతం ఏర్పడి ఏడాది పూర్తయిన వారికి రెగ్యులర్ చేయడం దే వుడెరుగు కనీసం వారికి నెల నెలా జీతా లు ఇచ్చే స్థితిలో లేదు. జూలై నుంచి ఇ ప్పటి వరకు జీతాలు రాక రెగ్యులర్ కాక కాంట్రాక్ట్ లెక్చరర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయంపై అధికారులు, నాయకులను కలిసి పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా లాభం లేకపోయిం ది. నాయకులు అధికారులు కాంట్రాక్ట్ లెక్చరర్లపై దృష్టి సారించి వెలుగులు నిం పాలని పలువులు కోరుతున్నారు.