మహబూబ్‌నగర్ జిల్లా క్రీడలకు నెలవుగా మారింది. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత మైదానాలకు మహర్దశ చేకూరింది. జిల్లాలో స్టేడియం ఏర్పాటు, అభివృద్ధి పనులకు రూ.51.29 కోట్లు మంజూర య్యాయి. మూడు నియోజకవర్గాలకుగానూ ఐదు స్టేడియాలు ఏర్పాటు చేస్తుండగా.. ఇప్పటివరకు మూడు చోట్ల పనులు పూర్తయ్యాయి. చిన్నచింతకుంట మండలం అల్లీపూర్ గ్రామంలో రూ.1.29 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మించారు. భూత్పూరు మండలం పోతులమడుగులో రూ.3.40 కోట్లతో నిర్మిస్తున్న మినీ ఇండోర్ స్టేడియం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఎంవీఎస్ కళాశాలలో రూ.2.65 కోట్లతో మినీ ఇండోర్ స్టేడియాన్ని అధునాతనంగా నిర్మించగా, ఇటీవల ప్రారంభించారు. జడ్చర్లలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రూ.90లక్షలు, హన్వాడ మండలంలో మినీ స్టేడియం నిర్మాణానికి రూ.3.70కోట్లు మంజూరు కాగా, పనులు ప్రారంభించాల్సి ఉన్నది. కాగా, జిల్లా కేంద్రంలో రూ.11.98 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. రెండతస్తులు, ప్రేక్షకుల కోసం గ్యాలరీ, కుర్చీలు, అధునాతన సదుపాయాలు కల్పించారు. ప్రధాన స్టేడియం ఆధునీకరణలో భాగంగా రూ.2.50 కోట్లతో క్రీడాకోర్టులు నిర్మించారు. రూ.8 కోట్లతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్‌ను ఎనిమిది వరుసల్లో నిర్మిస్తున్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు సర్కారు దోహదపడుతున్నది. మినీ ఇండోర్ స్టేడియం, క్రీడాకోర్టులు ఏర్పాటు చేస్తుండడంతో క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ టౌన్, అక్టోబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా మైదానాలు, స్టేడియం ల ఆధునీకరణ, క్రీడా కోర్టులు ఏర్పా టు చేస్తున్నారు. దీంతో మైదానాలకు మహర్దశ చేకూరింది. క్రీడాకారులు వాకింగ్ చేసేందుకు కూడా వీల్లే ని మహబూబ్‌నగర్ స్టేడియం స్టేడి యం నూత న హంగు లు అద్దుకున్నది. చాలా రో జుల త రువాత వచ్చిన వారికి ఇది మ హబూబ్‌నగర్ స్టేడియమేనా అ న్న సందేహం కలగక మాన దు. రూ.కోట్ల నిధులు వెచ్చించి ప్రధాన స్టేడియాన్ని అం దం గాము సాబు చేశారు. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మిం చారు. వాలీబాల్ అ కాడమీ పనులు వేగం గా జరుగుతున్నాయి. స్టేడియంలో అధునాతన సింథటిక్‌తో కూడిన అథ్లెటిక్స్ ట్రాక్ సైతం మంజూరు కావ డం విశేషం. జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు ఐ దు మినీ స్టేడియాలు మంజూరు కాగా.. ఇప్పటికే మూడు చోట్ల పనులు పూర్తయ్యాయి, రెండు స్టేడియాల పనులు చేపట్టాల్సి ఉన్నది. ఇలా స్వరాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లాకు క్రీడల కోసం రూ.51.29 కోట్లు మంజూరుకాగా, సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. కొన్ని పనులు తుది దశలో ఉన్నాయి. ప్రధాన స్టేడియంలో ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి.
రూ.2.50 కోట్లతో క్రీడాకోర్టులు నిర్మించారు. వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఆర్చరీ, కబడ్డీ, అథ్లెటిక్స్ కోర్టులు ఏర్పాటు చేశారు. క్రీడాకారులు జిల్లా కేంద్రంలో ఇం డోర్ స్టేడియం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూశారు. 2021 ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని రూ.11.98 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులు షురూ చేశారు. ఈ నిధులతో స్టేడియం భవనానికి రూ.6.99 కోట్లు, మల్టీపర్పస్ అభివృద్ధికి రూ.2.20కోట్లు, రెండో అంతస్తు నిర్మాణానికి రూ.2.79 కోట్లు వెచ్చించారు. పనులు పూర్తి కావడంతో ఇటీవల ఇండోర్ స్టేడియాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్, క్రీడాకారిణి గుత్తాజ్వాల ప్రారంభించారు. దీంతో క్రీడాకారులు ఇండోర్ ఆటలు సాధన చేసుకునేందుకు వీలు కలిగింది. ఈ స్టేడియంలో అంతర్జాతీయ పోటీలు సైతం నిర్వహించునేలా సుందరంగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులు కూర్చొని వీక్షించేలా గ్యాలరీ, కుర్చీలు ఏర్పాటు చేశారు. కాగా, అదనంగా మల్టీపర్పస్ ఇండోర్ అభివృద్ధి పనులకు ఇటీవల రూ.16.68కోట్లు మంజూరయ్యాయి. వీటితో మరిన్ని క్రీడా కోర్టులు తదితరాలతో ముస్తాబు చేస్తారు. స్టేడియం ఆధునీకరణ పనుల్లో భాగంగా అథ్లెటిక్స్ ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో క్రీడాకారులు ఆడుకునేందుకు వీలు లేకుండా మారింది.
ఈ క్రమంలో ఇటీవల రూ.8కోట్లతో మహబూబ్‌నగర్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ మంజూరైంది. 8 వరుసల్లో నిర్మిస్తున్న ట్రాక్ అందుబాటులోకి వస్తే జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు సైతం నిర్వహించుకునేలా.. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో రూ.2.65 కోట్లతో మినీ ఇండోర్ స్టేడియాన్ని అధునాతనంగా నిర్మించారు. ఇందులో ఇండోర్ ఆటలతోపాటు జిమ్ కూడా చేసుకునేందుకు వీలున్నది. టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్ తదితర ఇండోర్ క్రీడలు ఆడుకోవచ్చు. అలాగే దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలంలోని అల్లీపూర్ గ్రామంలో రూ.1.29కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మించారు. భూత్పూరు మండలం పోతులమడుగులో రూ.3.40 కోట్లతో నిర్మిస్తున్న మినీ ఇండోర్ స్టేడియం పనులు తుది దశకు చేరుకున్నాయి. జడ్చర్లలో ఇండోర్ స్టేడి యం నిర్మాణానికి రూ. 90లక్షలు మంజూరయ్యా యి. అలాగే నూతనంగా హన్వాడ మండలంలో మినీ స్టేడి యం నిర్మాణానికి రూ. 3.70కోట్లు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభం కావా ల్సి ఉన్నది. ఇలా ఇక్కడి నుంచే క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో ఎదిగేందుకు దోహదపడేలా సర్కారు కృషి చేస్తున్నది.