వెల్దండ : ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్పై ( KCR ) రేవంత్ ( Revanth reddy ) ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ (BRS) నాయకులు ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మద్దతుగా వెల్దండ మండలం నుంచి బీఆర్ఎస్ నాయకులు బుధవారం హైదరాబాద్కు తరలి వెళ్లారు.
బీఆర్ఎస్ జిల్లా నాయకులు మధుసూదన్ రెడ్డి, సిద్ధగోని రమేష్ గౌడ్, రవికుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ఏనాడు తప్పు చేయడని , సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసిన వాటిని సమర్దవంతంగా ఎదుర్కొనే ధైర్యం పార్టీ అధినేతకు ఉందని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు నీరందడంతో పాటు తెలంగాణ ప్రజలకు తాగునీరు సైతం అందిందని గుర్తు చేశారు.