పెద్దమందడి : ఆచరణకు నోచుకోని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ( Congress ) అమలులో ఘోరం విఫలమైనందున వెంటనే అధికారం నుంచి తప్పుకోవాలని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ( Vakiti Sridhar ) డిమాండ్ చేశారు.
ఈనెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనాల తరలింపుపై పెద్ద మందడి మండలం మోజెర్ల, మద్దిగట్ల, అమ్మపల్లి,గట్లాఖానాపూర్,స్కూల్ తండా,వెల్టూర్ గ్రామాలలోనిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ రజతోత్సవ సభకు వచ్చేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. 18నెలల కాంగ్రెస్ పాలనలో హామీలు అందక వ్యవసాయం, రియల్ ఎస్టేట్ కుదేలు అయిందని ఆరోపించారు. నష్టాలు భరించలేక రైతులు, రియల్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ విట్ట శశివార్ధన్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, శివ గౌడ్, సర్పంచ్ మోజెర్ల సునీత, తిరుపతయ్య నడిపి చంద్రయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు సతీష్, రఘువర్ధన్ రెడ్డి గట్ల ఖానాపూర్ తాజా మాజీ సర్పంచ్ వెంకటేష్, ఉద్యమకారులు హనుమంతు, సురేష్, వెళ్టూర్ చిత్తూరు కృష్ణ రెడ్డి, అన్నెల వెంకటయ్య పంబ యాదయ్య, అమ్మ పల్లి గ్రామం లో రమేశ్వర్ రెడ్డి, బందెన్న, బుచ్చన్న స్కూల్ తండా గోపాల్ నాయక్ , దండు అశోక్ పాల్గొన్నారు.