భూ క్రమబద్దీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని, ప్రజల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయమని, పూర్తిగా ఉచితంగా ధ్రువీకరణ చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించింది. పేద, మధ్య తరగతి కుటుంబాలపై రూ.లక్షల భారం మోపుతున్నది.
ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా క్రమబద్ధీకరణకు ముందడుగు వేస్తున్నది. ఈ క్రమంలో ప్లాట్ల ధరకు మించి రెగ్యులరైజ్ ఫీజు వసూలు చేస్తుండడంతో యజమానులు బెంబేలెత్తి పోతున్నారు. పండుగల వేళ ఇదేం బాదుడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వెంటనే ఫీజులు తగ్గించడంతోపాటు ఎల్ఆర్ఎస్ గడువు కూడా పొడిగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
– మహబూబ్నగర్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
LRS | ఖజానా దివాలా తీయడంతో ఆదాయం కోసం సర్కార్ అడ్డదారులు తొక్కుతున్నది. ప్లాట్ల క్రమబద్ధీకరణ పేరుతో రాష్ట్ర సర్కార్ ఎల్ఆర్ఎస్ స్కీంను తెరమీదకి తీసుకొచ్చింది. ఈనెల 31 వరకు గడువు పెట్టి 25% రాయితీని ప్రకటించింది. మున్సిపాలిటీ నగరపాలక సంస్థల్లో అక్రమంగా వెలిసిన వెంచర్లలో ప్లాట్లు తీసుకున్న యజమానులు నష్టపోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీంను కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయ మార్గంగా మలుచుకున్నది. ప్లాట్లు కొన్న యజమానులకు స్కీం క్రమబద్ధీకరణ పేరుతో వస్తున్న చలాన్లు దిమ్మ తిరుగేలా ఉన్నాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ని అన్ని మున్సిపాలిటీల్లో, పాలమూరు నగరపాలక సంస్థలో ఇదే పరిస్థితి నెలకొన్నది. ప్లాటు కొన్న ధర కన్నా రెగ్యులరైజేషన్కు అధికంగా వసూలు చేస్తుండడంతో జనం మండిపడుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ఒకటి ఉండగా, ఇక్కడ చూపిస్తున్న ఫెనాల్టీలు మరోలా ఉండడంతో చాలా మంది నిరాసక్తత కనబరుస్తున్నారు. అయితే ఎక్కడ రాయితీ రాదేమోననే ఆందోళనతో కొంతమంది కట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఏ మున్సిపాలిటీలో కూ డా ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం వసూలు కా వడం లేదని తెలుస్తోంది. మరోవైపు ప్లాట్లు కొన్న యజమానులు ఎల్ఆర్ఎస్ విషయంలో ఎవరిని అడిగి తెలుసుకోవాలో అర్థంకాక మున్సిపాలిటీల చుట్టూ తిరుగుతున్నారు.
మహబూబ్నగర్ నగరపాలక సంస్థతోపాటు ఉమ్మ డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కొన్న ప్లాట్ల ధర కన్నా రెగ్యులరైజేషన్ ఫీజు ఎక్కువ వస్తుండడంతో జనం లబోదిబోమంటున్నారు. ఉదాహరణకు మహబూబ్నగర్ పట్టణంలో 1990 సంవత్సరంలో కొన్న ప్లాటు ధర రూ.35,000 కాగా, ప్ర స్తుతం అదే ప్లాటు రెగ్యులరైజేషన్ చేసుకోవాలంటే రూ.లక్షకు పైగానే అవుతున్నది.
నిబంధనల ప్రకారం అప్పటి మార్కెట్ వ్యాల్యూ ఆధారంగా 14% ఫీజు వసూలు చేయాల్సి ఉండగా, ప్రస్తుతమున్న మార్కెట్ వ్యా ల్యూను లెక్కించి ఫీజు వసూలు చేస్తుండడంతో ప్లాటు ధర కన్నా ఫీజే ఎక్కువ అవుతున్నది. రెగ్యులరైజేషన్తోపాటు ఇల్లు కట్టుకోవాలంటే ప్లాట్ ఏరియాను బట్టి ఇతర ఫీజులు కూడా నిర్ణయించారు. ఈ ఫీజు ఇల్లు కట్టుకునేందుకు అనుమతి తీసుకునేటప్పుడు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కూడా ముందుగానే చెల్లిస్తే 25శాతం రాయితీ వస్తుండడంతో ఆ దిశగా జనం కట్టుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నా ఆన్లైన్లో కనిపిస్తున్న ఫీజు చుక్కలు చూపిస్తోంది. దీంతో జనం కట్టకుండా వదిలేస్తున్నారు.
మున్సిపాలిటీల్లో అనేక గ్రామాలు విలీనమయ్యాయి. అప్పట్లో ప్లాట్లు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. గజం ధర బహిరంగ మార్కెట్లో రూ.100 నుంచి రూ.600 వరకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం మా ర్కెట్ వ్యాల్యూ రూ.1,000 నుంచి రూ. 6,000ల వరకు ఉన్నది. వాస్తవంగా నిబంధనల ప్రకారం ప్లాట్ కొన్న రోజు ఉన్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారం 14శాతం రెగ్యులరైజేషన్ ఫీజు రావాలి. కానీ అందు కు భిన్నంగా ప్రస్తుతం ఉన్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఫీజు వసూలు చేస్తుండడంతో ప్లాటు ధర కన్నా ఎక్కువ అవుతుండడంతో గ్రా మాల్లో కూ డా చాలా మంది రెగ్యులరైజ్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితే మున్సిపాలిటీ లో విలీనం కావడం వల్ల భవిష్యత్లో ఈ ప్లాట్ లో ఇల్లు కడితే ఇబ్బందులు తప్పవని భావించి కట్టడానికి వెళ్లినా ఫీజులు మతిపోగొడుతుండ డంతో అవాక్కవుతున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం జనం ఉత్సాహం కనిపిస్తున్నా నిబంధనలకు విరుద్ధంగా వస్తున్న ఫీజులతో బెంబేలెత్తుతున్నారు. రెగ్యులరైజేషన్ చేసుకునే విషయంలో సందేహాలు ఎవరిని అడగాలో తెలియక తికమక పడుతున్నారు. ఆయా చోట్ల ఆఫీసర్లు తమకు తెలియదంటే తమకు తెలియదని తప్పించుకుంటున్నారు. జవాబుదారీతనం లేకపోవడంతో ప్రజలు అధికారులు, సర్కారు తీరుపై మండిపడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు టార్గెట్లో కనీసం 20 శాతం కాలేదని తెలిసింది.
మార్పు, మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే పండుగ పూట రెగ్యులరైజేషన్ స్కీం పెట్టి జేబులు ఖాళీ చేస్తున్నదనే విమర్శలు వస్తున్నా యి. ఉగాది. రంజాన్ పెద్ద పండుగలు ఉండడంతో ఎల్ఆర్ఎస్ పేరుపై ముక్కు పిండి వ సూలు చేసే కార్యక్రమానికి సర్కారు పూనుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. గడువును పెంచాలని, ప్లాట్ యజమానులకు సందేహాలను నివృత్తి చేసి న్యాయబద్ధంగా వసూలు చేయాలని డి మాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు.