మరికల్, నవంబర్ 11 : ప్రభుత్వ అధికారిక సమావేశంలో కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తూ.. స్టేజీపై మైక్‌ను తీసుకొని పార్టీ కార్యక్రమంగా మార్చిన సంఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. సోమవారం మరికల్ మండల కేంద్రంలోని సూర్యచంద్ర ఫంక్షన్హాల్లో మరికల్, ధన్వాడ మండలాల్లోని లబ్ధిదారులకు కల్యాణచెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైంది. అయితే ఈ ప్రోగ్రామ్‌లో అధికారుల మాట వినకుండా ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే పార్టీ కార్యక్రమంగా వ్యవహరించి లబ్ధిదారులను పిలిచి.. ఫొటోలకు ఫోజులిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై అధికారు లు నరాజ్ అయ్యారు. మరికల్, ధన్వాడ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు వీరన్న, నరహరి, ధన్వాడ మాజీ సింగిల్‌విండో చైర్మన్ నిరంజన్‌రెడ్డి, పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్ గొల్ల కృష్ణయ్య, పుసల్పాడ్ రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు హరీశ్ కుమారులు స్టేజీపై కూర్చోవడంతో అధికారులు చేసేది లేక పక్కన మిన్నకుండిపోయారు. అధికార కార్యక్రమంలో నా యకులు పోటాపోటీగా స్టేజీపై కూర్చోవడంతోపాటు ప్రసంగాలు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.