అమరచింత, అక్టోబర్ 10 : తెలంగాణలో మార్పుపేరుతో ప్రజలను మోసం చేసే అబద్ధపు హమీలతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హమీలను నేరవేర్చడం లేదని, గ్రామాలను అభివృద్ధి చేస్త్తారన్న నమ్మకం తమకు కలగడం లేదంటూ అందుకే కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నామని అమరచింత మండలం నందిమళ్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వీరికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కారు ఎక్కెందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్యూ కడతారని, అమలు చేయలేని హమీలను ఇచ్చి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు మాటలతో కాలయాపన చేస్తుంటే పట్టణల్లో, గ్రామాల్లో ఉన్న ప్రజలకు మొఖం చూపలేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో ఆత్మకూర్, అమరచింత మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ఉన్నారు.