దేవరకద్ర : దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఫరూక్ జాతీయ జెండాను అవమానించిన సంఘటన చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా జాతీయ జెండాను తలకిందులుగా ఎగుర వేశారు. తలకిందులుగా ఉన్న జెండాను గమనించిన కాంగ్రెస్ నాయకులు వెంటనే తలకిందులుగా ఉన్న జాతీయ జెండాను సరిచేసి తిరిగి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అయినప్పటికీ జెండాకు అవమానం జరిగిందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.