గద్వాల అర్బన్, డిసెంబర్ 29 : పోలీస్ అధికారుల ఆదేశాలు సామాన్యులకేనా.. రాజకీయ నా యకులకు వర్తించవా అంటే.. ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. మల్దకల్ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వేర్వేరుగా బండలాగుడు పోటీలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకు నే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు పోటీలను అడ్డుకొని అవగాహన కల్పించి 144 సెక్షన్ అమలు చేశారు. ఈ క్రమంలో పోలీసుల ఆదేశాలను బీఆర్ఎస్ నాయకులు పాటిస్తూ పోటీలను విరమించుకున్నారు. అయితే ‘అధికారం మాదే.. మేమే నిర్వహిస్తాం’ అంటూ కాంగ్రెస్ నాయకులు పోటీలను ప్రారంభించారు. అధికారుల ఆదేశాలను హస్తం నేతలు బేఖతారు చేయడంతో పోటీలను నిలిపివేశారు.
‘అధికారంలో మేమే ఉన్నాం.. మే ము చెప్పిందే మీరు వినాలి.. మాకే ఎదురు చెబుతారా..’ అంటూ పోలీసులను నిలదీశారు. పోటీల ను అడ్డుకోవడంపై గురువారం మల్దకల్లో కాం గ్రెస్ నాయకులు రాత్రి వరకు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 144 సెక్షన్ను కాం గ్రెస్ నాయకులు ఉల్లంఘించడంతోపాటు జంతు హింసకు సంబంధించిన కేసులను వారిపై నమోదు చేశారు. అయితే శుక్రవారం కూడా వారు మళ్లీ పోటీలను నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఆదేశించినా పోటీలు అపకుండా నిర్వహించడం ఏంటని ప్రజ లు చర్చించుకుంటున్నారు. సామాన్యులకు ఒక న్యాయం.. రాజకీయ నాయకులకు ఒక న్యాయం ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. గద్వాల ప్రాం తంలో కొన్నేండ్లుగా ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా ఉండగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం కాంగ్రెస్ నాయకులు ఘర్షణలకు దిగుతుండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా రు. అయితే శుక్రవారం బండలాగుడు పోటీలను నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు తిరుపతయ్య, బండ్ల చంద్రశేఖర్రెడ్డి, బండ్ల రాజశేఖర్రెడ్డి, అల్వా ల రాజశేఖర్రెడ్డి, పెద్దొడ్డి రామకృష్ణతోపాటు 36 మందిపై మల్దకల్ పోలీస్ స్టేషన్లో రెండోరోజూ కేసులు నమోదు చేశారు.
కేసులు నమోదు చేస్తున్నాం..
లా అండ్ ఆర్డన్ను కాపాడడమే పోలీస్ అధికారుల కర్తవ్యం, మల్దకల్ ప్రాంతలో 144 సెక్షన్ అ మలు చేశామని గద్వాల డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆ ప్రాంతంలో ఎలాంటి బండలాగుడు పో టీలను నిర్వహించకూడదని అందరికీ వివరించామన్నారు. జంతుహింస చట్ట ప్రకారం నేరం, ఈ విషయం అందరికీ తెలియచేశామన్నారు. అయినా అధికారుల ఆదేశాలు పాటించకుండా పోటీలు ని ర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులపై కేసులు నమో దు చేశామని చెప్పారు.