మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భూత్పూర్, జనవరి 21 : సర్పంచ్ ఎన్నికల్లో మండల కాం గ్రెస్ అధ్యక్షుడు సొంతూరులో ఓటమిపాలైనందుకు కక్షగట్టి.. సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తను బలవంతంగా కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో సంచలనం సృష్టిస్తో ంది. కాంగ్రెస్ నేతల దాడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎస్సై పట్టించుకోకుండా వెనక్కి పంపించిన ఘటన భూత్పూర్ మండలంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. భూత్పూర్ మండలం మద్దిగట్లలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుదారుడు ఓటమిపాలయ్యాడు.
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి సొంతూరు ఇదే.. ఇటీవల ఆయన జడ్చర్ల పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించి ఓ ఎస్సై గల్లా కూడా పట్టుకొని నానా రభస చేసిన సంగతి తెలిసిందే. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ పోస్టుపై బీఆర్ఎస్ కార్యకర్త వెంకటేశ్‌గౌడ్ కామెంట్ పెట్టాడు. దీనిని మనసులో పెట్టుకున్న శ్రీనివాస్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపతిరెడ్డి కలిసి మంగళవారం సా యంత్రం భూత్పూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న వెంకటేశ్‌గౌడ్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకొని కిడ్నాప్‌కు ప్రయత్నించారు. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న రైతు వేదిక వద్దకు తీసుకువెళ్లి అతడిపై దాడికి దిగారు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినా వినకుండా నిన్నుకొట్టడం కాదురా..? చంపేస్తాం రా..? ఊర్లో కల్లు అమ్ముకుం టూ బీఆర్ఎస్కు మద్దతు ఇస్తావా? అం టూ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మాపైనే సోషల్ మీడియాలో పోస్టులు పెడతావా? అంటూ విచక్షణా రహితంగా చేయి చేసుకున్నారు.
జడ్చర్ల ఎస్సై గల్లా పడితేనే నన్ను ఎవరూ ఏం పీకలేదు.. నువ్వు ఓ లెక్కనా? అంటూ దుర్భాషలాడాడు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకొని వెంకటేశ్‌గౌడ్ భూత్పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. ఫిర్యాదు అందించగా.. ఎస్సై తీసుకోకుండా వెనక్కి పంపించాడు. దీంతో బంధువులు ఇంట్లో వెంకటేశ్‌గౌడ్ తలదాచుకొని బుధవారం ఉద యం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విషయం తెలిపాడు. ఒంటిపై ఉన్న గా యాలను చూసి చలించిన ఆయన హుటాహుటిన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కైంప్లెంట్ ఇచ్చారు. ఈ ఫిర్యాదుపై ఎలా ంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులతో కలిసి సాయంత్రం దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆఫీసుకు వెళ్లారు. ఎస్పీ సెలవులో ఉండడంతో ఏఎస్పీ రత్నంకు ఫిర్యాదు చేశారు.
నాకు ప్రాణహాని ఉంది : వెంకటేశ్‌గౌడ్
మద్దిగట్ల గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ మద్దతుదారుడు గెలవడంతో నాపై కక్ష కట్టారు. ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్‌కు కామెంట్ పెట్టినందుకు కూడా కక్ష పెంచుకొని భూత్పూర్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు భూపతిరెడ్డిలు కలిసి దాడికి దిగి నన్ను చంపేస్తామంటూ బెదిరించారు. వీరిద్దరి నుంచి నాకు ప్రాణహాని ఉందని వెంటనే వీరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని బాధితుడు వెంకటేశ్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు.
అరాచకాలేందీ? : ఆల
సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుడు గెలిచినందుకు కక్ష కట్టి మా కార్యకర్త వెంకటేశ్‌గౌడ్‌పై అధికార పార్టీ నాయకులు దాడికి దిగడం.. విచక్షణారహితంగా కొట్టి చంపేస్తామని బెదిరించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. అసలు పోలీసు వ్యవస్థ ఎటుపోతుంది? బీఆర్ఎస్ కార్యకర్తలను కేసులను పెట్టి మరి వేధిస్తున్నారన్నారు. అక్రమ కేసులు పెడితే మా మండల అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి 19 రోజులు జైలులో ఉన్నాడు.. పథకం ప్రకారం ప్రేమ్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
ఎస్సై వారికి వకాల్తా పుచ్చుకొని భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మా కార్యకర్తను కొడితే పోలీసులు ఫిర్యాదు తీసుకోవట్లేదు ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్య వహరించాలన్నారు. భూ త్పూర్ మం డల అధ్యక్షుడిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్య తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ఈ దాడిపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడా స్పందించి కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేయాలని, కాంగ్రెస్ నాయకుల ఆగడాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని డిమాండ్
చేశారు.
నేతలపై కేసు నమోదు
భూత్పూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూపతిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు బసవని వెంకటేశ్‌గౌడ్ భూత్పూర్ పీఎస్‌లో ముందుగా ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయక పోవడంతో మాజీ ఎమ్మెల్యే ఆల, అదనపు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఆయన ఆదేశాల మేరకు
కేసు నమోదు చేశారు.