బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేయడంపై నేతలు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మరో ఎమ్మెల్యే గాంధీ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో గురువారం గులాబీ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను అరెస్ట్ చేసిన విషయం విధితమే.
ఈ అక్రమ నిర్బంధాలను నిరసిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం హైదరాబాద్‌లో తలపెట్టిన నిరసనకు పెద్ద ఎత్తున వెళ్తున్న నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు.
అర్ధరాత్రి నుంచే అరెస్టుల పర్వం మొదలుపెట్టి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించి దిగ్బంధించారు. వెల్దండ మండల కేంద్రంలో అరెస్టులను నిరసిస్తూ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.
ప్రభుత్వ తీరుపై పలువురు మండిపడ్డారు. ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 13