Mahabubnagar | మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్‌పై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు.. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్‌తో పాటు మరికొందరు డైరెక్టర్లు అకారణంగా అధికారులను దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
గత కొంతకాలంగా మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మార్కెట్ కమిటీ చైర్మన్ మహిళా కావడంతో వైస్ చైర్మన్ చీటీకి మాటికి మార్కెట్‌కి వెళ్లి వ్యాపారస్తులను.. మార్కెట్‌కు వచ్చే రైతులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కమిటీ సమావేశాల్లో కూడా వైస్ చైర్మన్ వర్గం అధికారికంగా వ్యవహరిస్తుండడంతో ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మార్కెట్ కమిటీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. చైర్మన్ విషయం ప్రస్తావించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. దీంతో ఉద్యోగులంతా భయభ్రాంతులకు గురయ్యారు. తనపై అకారణంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, కొంతమంది కమిటీ మెంబర్లు దాడికి దిగారని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.