గద్వాల, డిసెంబర్ 3 : బడుగు బలహీన వర్గాలు చదువుకునే విద్యార్థుల వసతి గృహాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందంటే అవుననే చెప్పవచ్చు. వరుసగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురై అస్వస్థత పాలవుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. గత అక్టోబర్ నెలలో ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ వసతి గృహం, ఎర్రవల్లి మం డల కేంద్రంలో ఉన్న ఎస్సీ వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు మరువక ముందే మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్టీ వసతిగృహ విద్యార్థులు ఉప్మాతోపాటు అరటి పండు, బిస్కెట్లు తినడడంతో ఫుడ్ పాయిజన్‌కు గురై 14మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా వారికి జిల్లా దవాఖానలో చికిత్స అందించగా కోలుకుంటున్నారు.
వరుస ఘ టనలు జరుగుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని మాత్రం వీడడం లేదని తెలుస్తుంది. ఈ ఘటనలతో జో గుళాంబ గద్వాల జిల్లాలో వసతిగృహ విద్యార్థులపై ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం నిండుగా కనిపిస్తుంది. రేవంత్‌రెడ్డి సర్కారులో విద్యార్థులకు వసతి గృహాలు శాపంగా మారాయి. వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కా వడానికి ప్రధాన కారణం వసతి గృహంలో నాణ్యత లేని సరుకుల వల్లే అని తెలిసినా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసతిగృహాలకు సరఫరా చేసే వస్తువులను తనిఖీ చేయాల్సిన అధికారులు పత్తా లేకుండా పోవడంతో గత అక్టోబర్ నెలలో రెండు రోజుల్లో ఒక వసతిగృహంలో 54 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా, ఆ సంఘటనలో విద్యార్థులు కోలుకుంటున్న సమయంలో మరో ఎస్సీ గురుకులంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అ య్యి దవాఖానలో చికిత్స పొందారు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తున్నట్లు తెలుస్తుంది. వసతిగృహాల్లో పేరుకు మాత్రమే ఫుడ్ కమిటీలు ఉన్నట్లు తెలిసింది. వసతి గృహాల్లో ఫుడ్ కమిటీలు ఏర్పాటు చేశామని, ఫుడ్ కమిటీలోని సభ్యు లు వండిన భోజనం తిన్నాకే మిగతా విద్యార్థులకు వడ్డించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే వసతి గృహాలు, గురుకులంలో జరిగిన ఘటనల సమయంలో ఫుడ్ కమిటీ సభ్యులు భోజనం చేయలేదా అనేది తెలియాల్సి ఉంది. ఫుడ్ కమిటీ సభ్యులు భోజ నం చేశాకే మిగతా విద్యార్థులు తింటున్నారని చెప్పడం పూర్తిగా అబద్ధమని జరిగిన ఘటనలతో తెలుస్తోంది.
గతంలో 54 మంది.. ప్రస్తుతం 14 మంది విద్యార్థులకు అస్వస్థత
గత అక్టోబర్ నెలలో ఇటిక్యాల, ఎర్రవల్లి మండలం ధర్మారం బీసీ వసతి గృహంలో 140 మంది విద్యార్థులు ఉంటున్నారు. విద్యార్థులకు క్యాబేజీ, కాలీఫ్లవర్ రెండు కలిపి కూరను చేయడం, అది తిన్న విద్యార్థులు గంటలోపు ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకోవడం జరిగింది. వాస్తవంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ కలిపి వండుతా రా అనే విషయం తెలుసుకోకుండా వసతిగృహ నిర్వాహకులు రెండు కలిపి కూర చేసి విద్యార్థులకు వడ్డించడంతో 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి కారణమయ్యారు. దీనికి తోడు గుడ్డు ఇవ్వడం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. విద్యార్థులు వడ్డించే చారు పై కారం తేలి ఉందని ఇది కూడా ఫుడ్ పాయిజన్ కావడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో విద్యార్థులు అప్పుడు కోలుకుంటుండాగానే అదే మండలంలో అయిజ ఎస్సీ గురుకులం ఉన్నది. అక్కడ ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి ముగ్గురు విద్యార్థులు అస్వ
స్థతకు గురి కాగా వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్సలు చేయించారు. ఈ సంఘటనలు మరువక ముందే మంగళవారం జిల్లా కేం ద్రంలోని ఎస్టీ వసతిగృహ విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్ అయ్యి 14 మంది అస్వస్థతకు గురి కాగా వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. వీరు తిన్న ఉప్మాలో పురుగులు ఉం డడం ఉప్మారవ్వ గడ్డలు కట్టడం అందులో పురుగులు ఉండడం వల్ల పాయిజన్ అయినట్లు తెలుస్తుంది.
వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కావడానికి కారణం వసతి గృహలకు సరఫరా చేసే సరుకులతోపాటు, కూరగాయలు నాణ్యతలేనివి సరఫరా చేయడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంగళవారం జరిగిన సంఘటనలో కూడా విద్యార్థులకు వడ్డించిన ఉ ప్మా ఉండలు కట్టి ఉం డడం అం దులో పురుగులు ఉండడం ఇది గమనించిన వి ద్యార్థులు అక్కడి అధికారులకు చెప్పడంతో పె ద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే మరింత మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యేవారు. అయితే సరుకులను పరిశీలించాల్సిన ఫుడ్‌సేప్టీ అధికారులు పరిశీలించక పోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తుం ది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి వసతిగృహాలపై మరింత పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
మూడో విడుత నామినేషన్లు షురూ..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. బుధవారం మూడో విడుతలో మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 133 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులు 81 మంది, 1152 వార్డు మెంబర్లకు 174 మంది నామినేషన్లు వేశారు. అలాగే నారాయణపేట జిల్లాలో 110 గ్రామ పంచాయతీల్లో 60 సర్పంచ్, 994 వార్డులకు గానూ 66 మంది వార్డుమెంబర్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. వనపర్తి జిల్లాలో 87 సర్పంచ్ స్థానాలకు 45 మంది, 806 వార్డు స్థానాలకు 39 మంది నామినేషన్ వేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 75 సర్పంచ్ స్థానాలకు 38 మంది, 700 వార్డు స్థానాలకు 46 మంది అభ్యర్థులు నామి నేషన్ వేసినట్లు అధికారులు ప్రకటించారు.
టిఫిన్ చేసి వెళ్లాక కళ్లు తిరిగాయి
ఉదయం హాస్టల్లో ఉప్మా చేశారు. దాన్ని తినే సమయంలో ఉప్మా ఉండల్లో పురుగులు ఉన్నది గమనించి అధికారులకు చెప్పాం. అనంతరం అరటి పండు, బిస్కెట్లు తిని పాఠశాలకు వెళ్లాను ప్రార్థన సమయంలో కళ్లు తిరగడం వాంతులకు వచ్చినట్లు ఉండడంతో ఈ విషయం పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పగా వారు దవాఖానకు తరలించారు. ఆ తర్వాత మరి కొంతమంది విద్యార్థులకు ఇలా జరిగింది.
– వెంకటేశ్‌నాయక్, వసతిగృహ విద్యార్థి, గద్వాల
వాంతులు వచ్చినట్లు అయింది
హాస్టల్లో టిఫిన్ చేసిన తర్వాత అరటి పండు, బిస్కెట్లు తిని పాఠశాలకు వెళ్లాను. అక్కడ ప్రార్థన చేసే సమయంలో ఎండ తగలడం వల్ల కడుపులో గడబిడ కావడంతోపాటు కళ్లు తిరిగి అస్వస్థతకు గురి అయ్యాను. వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా దవాఖానకు తరలించి చికిత్సలు చేయించారు. ఉప్మాలో పురుగులు ఉన్నాయి. దానిని అలాగే వండారు. దాని వల్లే అస్వస్థతకు గురయ్యా..
– గురు, వసతి గృహ విద్యార్థి, గద్వాల