హన్వాడ, మార్చి 21 : ఆరు గ్యారెంటీలలో భాగంగా నాలుగు పథకాలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మండలానికో పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసింది. జనవరి 26వ తేదీన ఆర్భాటంగా రైతు భరోసా, ఆత్మీ య భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇం డ్ల పథకాలను వంద శాతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హ న్వాడ మండలంలో ఇబ్రహీంబాద్ను సెలెక్ట్ చేశారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిరబోయితోపాటు ఉన్నతాధికారులు ప్రారంభించారు. ప్రారంభానికి రోజు ముందుగా పబ్లిసిటీ కోసం 5 నుంచి 10 మందికి ఇండ్ల పత్రాలు, రేషన్‌కార్డులు, ఇ ందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా పత్రాలను అందజేశారు.
ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామంలో నాలుగు పథకాల అమలు ఎక్కడా కనిపించడం లేదు. ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చం దంగా పరిస్థితి తయారైంది. ఇబ్రహీంబాద్‌లో 10 వార్డులకుగానూ జనాభా 1,697, ఓటర్లు 1,426 మంది ఉన్నారు. 391 మంది ఇండ్లకు దరఖాస్తులు చేసుకోగా 97 మందికి మంజూరయ్యాయి. కానీ ఐదు నుం చి 10 మందికి మాత్రమే ప్రొసీడింగ్స్ అంది ంచారు. అలాగే 159 మంది రేషన్‌కార్డుల కో సం దరఖాస్తులు చేసుకుంటే 101 మందికి వచ్చాయి.
వచ్చినా కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. దీంతో ఎప్పుడు ఇ స్తారా..? అని ఎదురుచూస్తున్నారు. గ్రా మంలో ఏడుగురికి మత్రమే ఇందిరమ్మ భరోసా కింద రూ.6 వేల చొప్పు న డబ్బులు జమ చేశారు. ఇక భూమిలేని వారు ఉన్నారు. రైతుభరోసా కింద మూడు రెవెన్యూ గ్రామాలకు కలిపి మొత్తం 580 మంది రైతులకు రూ.3.80 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని అధికారులు తెలిపారు. అయితే నాలు గు పథకాల అమలు మాత్రం శూన్యం. ప్రభు త్వం గ్యారెంటీలు అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్నా.. పైలట్ గ్రామాల్లో ఎక్కడా అమలు కావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, అధికారులు లబ్ధిదారుల పేర్లు వెల్లడించడంతో సంతోషంతో వారు ఉంటున్న నివాసాలను తొలగించారు. ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గుపోసినా.. నేటికీ ఇంకా గుడిసెల్లోనే జీవనం గడుపుతున్నారు. అప్పుడు.. ఇప్పుడు.. అంటూ అధికారులు చెబుతున్నారని పలువురు వాపోయారు. లబ్ధిదారులకు ఇండ్ల ప్రొసీడింగ్‌లు అందించినా వాటిపై కలెక్టర్ సంతకంలేదు. ప్రొసీడింగ్ నెంబర్లు వేయలేదు.. ఇంతకు ఇండ్లు మంజూరు అయ్యా యా..? లేదా..? అన్న అయోమయంలో ఉన్నారు.