అచ్చంపేట, ఫిబ్రవరి 12 : అచ్చంపేట మార్కెట్ చైర్పర్సన్ అరుణపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు. దాడిని ఖండిస్తూ సోమవారం ఆయన స్వగృహంలో వి లేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం సకాలంలో స్పం దించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఉంటే ఈ ఘ టన జరిగేది కాదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధం గా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పంటలను కోనుగోలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండునెలలు పూర్తైనా ఆ ఊసే ఎత్తకపోవడం, రైతులు ధర లేక ఆందోళకు గురికావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంగా మారిందన్నారు. ఈ దాడికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఈ దాడిపై కొందరు మాట్లాడుతూ ఇది ఇతర పార్టీలవారు చేశారని ఘటన వెనుకఉన్న వారిపై విచారణ జరుపుతామని చెప్పి త ప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
స్థానిక ఎ మ్మెల్యే వంశీకృష్ణ ఘటన జరిగిన రోజు అచ్చంపేటలోనే ఉండి కనీసం ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి మాట్లాడ లేదని ఇప్పుడేమో నాకు అసెంబ్లీ ఉంది రెండు రోజుల తర్వాత వచ్చి విచారణ జరిపిస్తానని తప్పించుకొనే ధోరణి సరైందికాదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే చైర్‌పర్సన్‌పై దాడి జరిగిందన్నారు. ఘటనపై విచారణ జరిపించి దాడికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదనే కోపంతో రైతులు ఆగ్రహానికి గురికావడం జరిగిందన్నారు. రైతులు, చైర్పర్సన్ మధ్య వ్యక్తిగత ఘటనగా ఎమ్మెల్యే మాట్లాడిన తీరు ఉందన్నా రు. గత వారం రోజుల్లో రైతులు రెండు సార్లు మద్దతు ధర కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ కనీసం మార్కెట్‌కు వెళ్లి రైతులు, వ్యాపారస్తులతో మాట్లాడిన పరిస్థితి లేదన్నారు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై వెంటనే ప్రభుత్వం స్పందించి, చైర్‌పర్సన్‌పై జరిగిన అమానుష దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమండ్ చేశా రు. మద్దతు ధర కోసం రైతులు అనేక మార్గల్లో ఆందోళనలు చేయవచ్చు.. కానీ చైర్పర్సన్ అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా దాడి చేయడం, అవమానించడం సరైందికాదన్నారు. రైతులు సంయమనంతో ఉం డాలని కోరారు.