వనపర్తి, మే 31(నమస్తే తెలంగాణ) : జిల్లాలో మరో నెలరోజుల పాటు వరి ధాన్యం కొనుగోళ్లు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ నిర్వాకం వల్లే కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో ఆలస్యమవుతున్నది. ముందు నుంచి ఈ యాసంగికి గోదాంల కొరత ఉన్నదని జిల్లా యంత్రాంగానికి తెలిసిందే. 3లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం పెట్టుకున్న సంగతి విధితమే. అయితే, ఈ మేరకు ఏర్పాట్లు చేయడంలోనే ప్రభుత్వం విఫలమైంది. దీంతోనే సమ స్య ముదిరి నెల రోజులుగా కల్లాల్లో రైతులకు కునుకులేకుండా పోయిం ది. ఇదిలా ఉంటే, వారం రోజుల్లో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ము గించాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఇటీవల మహ బూబ్నగర్లో చెప్పడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
జిల్లాలో ఇప్పటివరకు లక్షా 74వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అష్టకష్టాలపై ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ యాసంగి సీజన్లో ఏరైతు కూడా ప్రశాంతంగా విక్రయాలు జరుపుకొన్న దా ఖలాలు లేవు. ఒకదాని వెం ట ఒకటి అన్నట్లు కల్లాల్లో అనేక సమస్యలు రైతులను పీడిస్తున్నాయి. ప్రధానంగా బస్తాల సరఫరా సక్రమంగా లేకపోవడం,తూకం వేసిన బస్తాలను ఎత్తక పోవడం, లారీలు రాకపోవడం, గోదాంల కొరతలు ఇలా అనేక సమస్యలు రైతులను చుట్టుముట్టాయి. దీంతో అధికారులు ఎన్ని చెప్పినా రైతులకు కొనుగోళ్లు మొదటి నుంచి సమస్యాత్మకంగానే పరిగణించాయి.
జిల్లా వ్యాప్తంగా ఇంకా లక్షన్నర మెట్రిక్ టన్నుల ధా న్యం కొనాల్సి ఉందన్న అంచనా ఉంది. జిల్లా పరిధిలో ని ఆత్మకూరు, అమరచింత, మదనాపురం, కొత్తకోట, పెద్దమందడి మండలాల్లో మెజార్టీగా కొనుగోళ్లు జరిగాయి. మిగిలిన మండలాల్లో ఇంకా చాలా వరకు ధా న్యం కొనాల్సి ఉంది. ప్రధానంగా చిన్నంబావి, వీపనగండ్ల, పాన్గల్, గోపాల్పేట, పెబ్బేరు, వనపర్తి మం డలాల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉన్నాయి.

సన్న వడ్ల పంట కొంత సానుకూలంగా జరుగుతుండగా, దొడ్డు రకం వడ్లున్న ప్రాంతాల్లోనే సమస్య జఠిలంగా ఉంది. ఇంకా కొన్ని గ్రామాల్లో సగం ధాన్యం నిల్వలు అలాగే ఉన్నాయి. లక్షన్నరమెట్రిక్ టన్నులకు పైబడి అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నా రు. అధికారులు వేసిన అంచనాల ప్రకారం అయితే, ఇంకా చాలా ధాన్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితులున్నాయి.
గోపాల్పేట మండలం జయన్నతిరు మలాపురంలో ఈ యాసంగి వరి ధాన్యం దిగుబడి ఎక్కువ మొత్తంలో వచ్చింది. ఇప్పటి వరకు ఈ గ్రామంలో కేవ లం 14 లారీల్లో 7వేల బస్తాలు మాత్రమే గోదాంకు చే రాయి. ఇంకా తూకం వేసిన బస్తాలు 6,500 వరకు ఉన్నాయి. ప్రస్తుతం 15 రోజుల నుంచి బస్తాలు రాక రైతన్నలు విలవిలలాడుతున్నారు. ఇదే గ్రామంలో ఇం కా 30 వేల బస్తాలకు పైగా వడ్లు తూకం వేయాల్సినవే ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఈ గ్రామం వనపర్తికి కూతవేటు దూరంలోనే ఉన్నా.. కొనుగోళ్ల సమస్య రైతులను ఎంతలా పీడిస్తుందో అర్థమవుతుంది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న ధాన్యం రాసులు పాన్గల్ మండలం కేతేపల్లి గ్రామానికి సంబంధించినవి. రైతువేదిక సమీపంలో కుప్పులు పోసుకొని నెలరోజులుగా తూకాల కోసం ఎదురుచూస్తున్నారు. మండలంలోనే అధికంగా వడ్లు పండించే ఈ గ్రామంలో ప్రస్తుతం ఈ యాసంగి సీజన్లో ఇప్పటివరకు 15 లారీల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా 40 లారీల వడ్లు గ్రామంలో సిద్ధంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. వారంరోజుల్లో వరి కొనుగోళ్ల ప్రక్రియ ముగించాలని ఒకవైపు ప్రభుత్వం చెబుతుంటే…ఇలా గ్రామాల్లో ఇబ్బడి..మొబ్బడిగా వరి ధాన్యం కుప్పల సంగతేమిటని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రెండు నెలలుగా కొనుగోలు చేయలేందీ…ఈ వారం రోజుల్లో ఎలా ముగిస్తారంటూ వస్తున్న ప్రశ్నలకు జవాబులు లేవు.