బిజినేపల్లి, ఏప్రిల్ 6 : తాగునీటి కోసం తండ్లాట లేకుండా కేసీఆర్ సర్కారు నట్టింట్లోని తీసుకొచ్చిన భగీరథ నీళ్లు కాంగ్రెస్ సర్కారులో కానరావడం లేదు. బిజినేపల్లి మం డల కేంద్రంలో భగీరథ నీళ్లు బంద్ కావడంతో తాగునీ టి కొరత నెలకొన్నది. ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే ట్యాంకులు నీళ్లు లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రెండు రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు రావడం లే దని ప్రజలు వాపోతున్నారు. 20రోజుల కిందట కూడా మిషన్ భగీరథ నీరు సక్రమం గా ఇలాగే బంద్ అయ్యాయని తెలిపారు. కొన్నాళ్లు వ చ్చి మళ్లీ నీళ్లు రావడం లేదని వాపోతున్నారు.
వేసవి కావడంతో తాగునీటి సమస్య తీవ్రమై అనేక ఇబ్బందులు ఎ దుర్కొంటున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలోనే తాగునీటి పరిస్థితి ఇలాగుంటే గ్రా మీణ, గిరిజన తండాల్లోని ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా చేయగా, కాంగ్రెస్ పాలన లో వేసవి ఆరంభంలోనే తాగునీటి క ష్టాలు మొదలయ్యాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు నీళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.