గట్టు, నవంబర్ 17 : వడ్లకు ఇస్తున్న బోనస్‌పై రైతులకు నమ్మకం సన్నగిల్లుతోంది. దీనికితోడు గత రబీలో రైతులకు బోనస్ అందలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన కూడా వరిధాన్యాన్ని ఇక్కడ అమ్మడానికి రైతులు ఆసక్తి చూపడంలేదు. దీనికితోడు కర్ణాటకలో వరికి ఎక్కువ ధర ఉంది. దీన్ని స్థానిక, కర్ణాటక వ్యాపారస్తులు సొమ్ముచేసుకుంటున్నారు. తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేసి కర్ణాటకకు తరలిస్తున్నారు.
ఈ క్రమంలో గట్టు మండలానికి చెందిన ఓ రైతు వరి ధాన్యాన్ని అమ్మడానికి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద కుప్పగా పోశాడు. కాని తన ధాన్యాన్ని స్థానిక వ్యాపారికి క్వింటాలుకు రూ.2500 మాదిరిగా అమ్మాడు. వ్యాపారి ధాన్యాన్ని కర్ణాటకకు తరలించాడు. తెలంగాణ ధాన్యం లారీలో కర్ణాటకకు తరలింది.