అచ్చంపేటటౌన్, జూన్ 19 : ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థితికి తీర్చిదిద్దిన అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. స్టూడెంట్స్‌కు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. భవనం పైకప్పు పెచ్చు లూడి ప్రమాదకరంగా మారింది. తరగతి గదుల్లో కూర్చోవాలంటేనే ఎప్పుడు పెచ్చులు ఊడిపడ్తాయేమోనని అధ్యాపకులు, విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మూత్రశాలలు నిరుపయో గంగా మారాయి. జెంట్స్ కళాశాల ఆరుబయటే పని కానిచ్చేస్తున్నారు. కొత్త టాయిలెట్లు నిర్మించినా ఇంకా అందుబాటులోకి రాలేదు.
తాగునీటి సమస్య తీవ్రంగా ఉండగా.. గతేడాది దాతల సహకారంతో సమస్య కొంత తీరింది. ఈ సమస్యలను చూసి కొత్తగా కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేందుకు విద్యార్థులు రావడం లేదని లెక్చరర్లు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోని నిధులు ల్యాప్స్ అచ్చంపేటలోని కాలేజీ గతంలో బాలుర కళాశాలగా ఉండగా.. చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థినులను దృష్టిలో ఉంచుకొని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అనుమతులతో 2016-17 నుంచి కో-ఎడ్యుకేషన్ ప్రారంభమైంది.
అయితే భవనం పాతబడిపోవడంతో కళాశాల అభివృద్ధ్ది పనులకు కేసీఆర్ ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించింది. తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో నిధులు మంజూరు కాకుండానే ల్యాప్స్ అయ్యాయి. ప్రస్తుతం భవనం అధ్వాన్నంగా తయారైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కళాశాలలో అదనపు గదులతోపాటు మౌలిక సదుపా యాలు కల్పించి మెరుగైన విద్యకు బాటలు వేయా లని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
వడ్డేపల్లి, జూన్ 19 : శాంతినగర్‌లోని రామచంద్రానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. ఒకటి నుంచి 5 వరకు తరగతులు నిర్వహిస్తుండగా 45 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరికి బోధించేందుకు కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కేవలం రెండు గదులు మాత్రమే ఉన్నా యి. అదనపు తరగతుల కోసం నూతన భవనం నిర్మిం చినా.. ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరింది.
మొదటి అంతస్తులోని భవనం కోసం ఏర్పాటు చేసిన మెట్లు మధ్యలోనే ఊడిపోయాయి. దీంతో ఉపాధ్యా యులు, విద్యార్థులు పైకి వెళ్లడం లేదు. దీనికి తోడు వంట గది అసలు లేదు.. బాలురకు టాయిలెట్స్ లేక ఆరుబయ టకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలలో మెరుగైన వసతులు, భవనానికి మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.