BRS Maganur | హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ సర్కార్
BRS Maganur | ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారని బీఆర్ఎస్ మాగనూర్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి విమర్శించారు.
మాగనూర్ : ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారని బీఆర్ఎస్ మాగనూర్ ( BRS Maganur ) మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి ( Yellareddy ) విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఎంపీవో కళ్యాణికి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో పంటలు ఎండిపోయే ప్రమాదం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని, ప్రస్తుతం కనీసం తొమ్మిది గంటలు కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కావడం లేదని వారు ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచులు రాఘవేందర్‌రెడ్డి, లక్ష్మప్ప, నర్సింహా, మాజీ సర్పంచులు మల్లారెడ్డి, పోస్ట్ అశోక్‌గౌడ్, సుతారి రవి, పల్లె మారెప్ప, పూల రాము, శంకర్‌గౌడ్, మొగులప్ప, శంక్రప్ప, శివరాం, చాలీమ్, గజపతి, జమీల్, బాలప్ప, వాకిటి రాజు, సాయప్ప తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

