గద్వాల, మార్చి 20 : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్ అంకెల గారడీ తప్పా నడిగడ్డ రైతులు, ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ అంతా పచ్చి అబద్దాల పుట్ట అన్నారు. ఉమ్మడిపాలమూర్తోపాటు గద్వాల నియోజకవర్గానికి బడ్జెట్ తీవ్రనిరాశ మిగిల్చిందన్నారు.
రూ.3.24లక్షల కోట్ల భారీ బడ్జెట్ అని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్పా క్షేత్రస్థాయిలో రైతులు, పేదలకు పైసా ప్రయోజనం లేదని, బడ్జెట్ మొత్తం ముఖ్యమంత్రి ప్రయోజనాల కోసమే అన్నారు. జోగుళాంబ గద్వాల జి ల్లాకు ఉపయోగపడే నెట్టెంపాడ్, బీమా, జూరా ల ప్రాజెక్టు పెండింగ్ పనులకు, కాల్వల ఆధునీకరణకు బడ్జెట్లో పైసా కేటాయించలేదన్నారు. పాలమూ రు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నా జిల్లా ప్రాజెక్టులపై వివక్ష చూపించారని ఆరోపించారు. సాగునీటి రం గానికి ఇచ్చిన రూ. 22,615 కోట్లు కేవలం పా త బకాయిలకే సరిపోతాయన్నారు. కొత్త ఆయకట్టుకు నీరు అందించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఎకరాకు రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని ఓట్లు వేయించుకొని ఇప్పుడు బడ్జెట్లో కేవలం రూ.18వేల కోట్లు కేటాయించడం రైతులను దగా చేయడమే అన్నారు.
ఈ నిధులు రాష్ట్రంలోని రైతులందరికీ పెట్టుబడి సహాయం అందించడానికి ఏ మూలకు సరిపోవని అన్నా రు. ఈ బడ్జెట్ రైతాంగాన్ని నట్టేట ముం చిందన్నారు. మిగిలిపోయి నా రూ.13వేల కోట్ల నిధు ల గురించి బడ్జెట్లో స్పష్ట త లేకపోవడం దారుణమై న విషయమన్నారు. తుమ్మి ళ్ల ఎత్తిపోతల పథకం రెండో విడుత నిధుల గురించి బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశ్వసనీయత, విజన్ లేదన్నారు. ప్రభు త్వం కేవలం కాగితపు లెక్కలతో కాలక్షేపం చే స్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతులు, ప్రజల ఆగ్రహానికి గురి తప్పదన్నారు.