వనపర్తి, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ బాకీ కార్డుపై వస్తున్న స్పందన చూస్తే.. రాబోయే ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బూటకపు వాగ్దానాలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో గల్లీ..గల్లీలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేస్తూ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెండేళ్లుగా నిర్లక్ష్యం చేశారని, బాకీపడ్డ బకాయిలను కాంగ్రెస్ చెల్లించే వరకు ప్రభుత్వాన్ని వదిలేది లేదన్నారు.
ప్రజలు సహితం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతోనే కాంగ్రెస్‌కు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలను కాంగ్రెస్ ఎంతలా మోసం చేసిందో.. అంతకు మించి ఓటరు ద్వారా సమాధానం చెప్పేందుకు ప్రజలు చైతన్యంతో ఉండటం సంతోషకర పరిణామన్నారు. అలివిగాని హామీలిచ్చి ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ మొండికేసిందని, ప్రతి కుటుంబానికి ఎంత బాకీ పడిందన్న ది ఓ కార్డు ద్వారా ఎనిమిది పథకాలతో ప్రజలకు వివరించే ప్రయత్నంలోనే ప్రతి ఇంటిని పలుకరిస్తున్నామన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేసిన సందర్భాలు లేవని కాంగ్రెస్ పరాకాష్టకు ఈ బాకీ కార్డులే నిదర్శనమని పేర్కొన్నారు. ముందుగా గాంధీనగర్ ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేసిన అనంతరం ఆయ న గల్లిబాటను ప్రారంభించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలపై ప్రజలు కండ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా తమకు ఇంత వరకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆవేదన చెందుతున్నారు. అబద్ధాల మీద అందలమెక్కిన కాంగ్రెస్ తమను పట్టించుకోవడం లేదని ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో గల్లీ..గల్లీలో మాజీ మంత్రి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేస్తూ పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజల నుంచి అనూహ్య స్పంద న రావడంతో బీఆర్ఎస్ నాయకులు మరిం త జోరు పెంచా రు.
ప్రతి ఇంటికీ కాంగ్రెస్ బాకీ ఉందని, గల్లీలో తిరిగినప్పుడు స్వ యానా ప్రజలే వెల్లడించడం.. దీనికి బా కీ కార్డు మరింత తోడవ్వడంతో జనం కాంగ్రెస్ అంటేనే భగ్గుమంటున్నారు. బీఆర్ఎస్ పట్టణ అద్యక్షుడు రమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన గల్లీబాటలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గట్టు యాద వ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధ ర్, నాయకులు కురుమూర్తి యాదవ్, అశోక్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, నాగన్నయాదవ్, పరంజ్యోతి, జోహెబ్ హుస్సేన్, శ్రీనివాసులు, ఇమ్రాన్, చిట్యాల రాము, సమద్, రమేశ్, పాషా, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి టౌన్, అక్టోబర్ 8 : కోర్టు తీర్పు ఏదైనా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం నాగవరం శివారులోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గోపాల్పేట మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అలవికాని, ఆచరణలో సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని, ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు ఇంటింటికీ తిరిగి ఇచ్చి వాళ్లు ఇచ్చిన హామీల మేరకు ప్రజలకు బకాయిపడ్డ రూపాయాలు ఎన్నో తెలియజేయాలని ఇదే మన ఎన్నికల అస్త్రం అని ఉద్భోదించారు. ము ఖ్యంగా ప్రతి గ్రామ కమిటీ సమావేశం అయి ఓటరు లిస్టును నిశితంగా పరిశీలించి ఓటరు చోరీని బహిర్గతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, గోపాల్పేట పార్టీ అధ్యక్షుడు బాలరాజు, మాజీ ఎంపీపీ సంధ్యాతిరుపతయ్య, చంద్రశేఖర్, తిరుపతిరెడ్డి, శ్రీనివాసులు, మతిన్, మాన్యనాయక్, శేఖర్, శ్రావణ్‌కుమార్, కర్రోళ్ల కుమార్, కర్రోళ్ల భాస్కర్, వడ్డెమాన్ రవి, నాగరాజు, మాజీ ప్రజాప్రతినిదులు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు.