జడ్చర్ల టౌన్, అక్టోబర్ 29 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాతబజార్కు చెందిన 50మంది యువకులు ఆదివారం జడ్చర్లలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అలాగే మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పదేండ్లలో జడ్చర్ల నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువకులందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు.