మక్తల్, అక్టోబర్ 20 : రైతుభరోసా ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదని, వారికి అందాల్సి న సాయాన్ని రేవంత్‌రెడ్డి ఢిల్లీ గులాంలకు ముట్టచెబుతున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. రైతుభరోసా ఇవ్వలేమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి-167పై రైతులు, నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ.. పోరాడి సా ధించుకున్న తెలంగాణలో వ్యవసాయరంగాన్ని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలా మార్చి రైతును రాజు చేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక కనీసం తాగడానికి కూడా నీళ్లవ్వలేని చేతగానితనాన్ని మూటగట్టుకుందన్నారు. 24గంటల కరెంట్, ఠంచన్‌గా ఏ డాదికి రెండు పంటలకు పెట్టుబడి సాయం అం దించడంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టి బీ ఆర్ఎస్ రైతులకు వెన్నుదన్నుగా నిలిచిందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యంకాని 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండు పంటలు పూర్తికావొస్తున్నా రైతులకు ఇప్పటికీ రూపాయి కూడా రైతుభరోసా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికి అసలుకే ఎ సురు పెట్టేలా మంత్రి వ్యాఖ్యలు చేయడం రైతులకు కాంగ్రెస్ ఏపాటి ప్రాధాన్యత ఇస్తుందో ఇట్టే తెలిసిపోతుందన్నారు. రైతు భరోసా ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలేది లేదని, రైతులకు అన్యా యం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతుబంధు డబ్బులను రేవంత్‌రెడ్డి తన సీఎం కుర్చీ కాపాడుకునేందుకు ఢిల్లీ గులాంలకు అప్పజెప్పి రైతుల నోట్లో మట్టికొడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌గుప్తా, రాజుల ఆశిరెడ్డి, ఎల్లారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రాజేశ్‌గౌడ్, చిన్న హన్మంతు, గాల్‌రెడ్డి, కుర్మయ్య, శంకర్, విష్ణువర్ధన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, అన్వర్ హుస్సేన్, మారుతిగౌడ్, రవికుమార్, ఈశ్వర్‌యాదవ్, కృష్ణ, అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.