వానమ్మ…వానమ్మ.. వానమ్మా.. ఒక్క సారన్నా వచ్చిపోవే వానమ్మా.. అని పాడుకునే పరిస్థితులొచ్చాయి రైతన్నలకు. పది రోజులుగా వరుణుడు పత్తా లేకపోవడంతో రైతులు ఆకాశం వంక ఆశతో ఎదురు చూస్తున్నారు. గతేడాది మాదిరిగా ఈనెలలో కూడా ముందుగానే పలకరించిన తొలకరితో విత్తనాలు వేసుకున్న కర్షకులు ఇప్పుడు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవారం రోజులు ఇలాగే ఉంటే వేసిన విత్తనాలు భూమిలో కలిసిపోతాయేమోననే బెంగ రైతుల్లో నెలకొన్నది.
వరుణుడి కరుణ కోసం రైతన్నలు ఎదురు చూ స్తున్నారు. తొలకరితో కురిసిన వర్షాలకు రైతన్నలు సంబురపడ్డారు. గతేడాది కూడా తొలకరిలో సమృద్ధిగానే వర్షాలు కురిశాయి. దీంతో ఈసారి కూడా అదేవిధంగా వానలు పడడంతో రైతులు చాలా మం ది పత్తి, జొన్న, మొక్కజొన్న తదితర విత్తనాలను విత్తుకొన్నారు. వాతావరణ శాఖ అంచనాలకంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, విస్తరించడంతో రైతులు సంబురపడ్డారు. అయితే అది ఆరంభంగానే మారింది. గత పదిరోజుల నుం చి దాదాపుగా వర్షాలు కురియడం లేదు. ఈ వారం నుంచి మళ్లీ భానుడి భగభగలు సెగలు కక్కిస్తున్నా యి. వానలు పడ్డాయని భావించిన రైతులు, ప్రజలకు మళ్లీ వేసవికాలం గుర్తొస్తోంది. దీంతో సాధార ణ ప్రజలకంటే ముఖ్యంగా రైతన్నలకు ఈ పరిస్థితు లు ఆందోళన కలిగిస్తున్నాయి. తొలకరి వానలు మంచిగానే కురిశాయి. దీనివల్ల భూమి కూడా చల్లబడింది. ఫలితంగా రైతులు విత్తనాలను నాటుకొన్నారు. ఎరువులు తదితర వాటిని కొనుగోలు చేసుకొన్నారు. ఇక వ్యవసాయ శాఖ ముందస్తుగానే అప్రమత్తమైంది. కానీ గత వారం, పది రోజుల నుంచి వానలు కురియక రైతులు ఆకాశం వంక చూస్తున్నా రు. ఈ సీజన్లో ఎప్పటిలాగే రైతులు పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా వ్యవసాయశాఖ అంచనా లు రూపొందించింది. మిగిలిన మొక్కజొన్న, జొన్నలాంటి విత్తనాలను పలువురు రైతులు విత్తుకొన్నా రు. వేసిన విత్తనాలు ఎప్పుడు మొలకెత్తుతాయోనని రైతులు ఓవైపు భూమి వంక చూస్తూ మరోవైపు వానకోసం ఆకాశానికి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నాగర్కర్నూల్ జిల్లాలో ఈ వానకాలం లో 4.73 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనాలు తయారు చేసింది. ఇం దులో అధికంగా పత్తి 2.73లక్షల ఎకరాలు ఉండగా ఇప్పటి వరకు జిల్లాలో 96వేల ఎకరాల్లో విత్తనాల ను నాటారు. నాటిన విత్తనాల్లో అధికంగా పత్తి విత్తనాలే 89,116 ఎకరాల్లో ఉండటం గమనార్హం. ఇక కందులు 565ఎకరాల్లో, మొక్కజొన్న 3,943ఎకరాల్లో, జొన్న 2,289ఎకరాల్లో నాటారు. ఇలా విత్తనాలు నాటిన రైతులు విత్తనాలు మొలకెత్తేందుకు వర్షాలు కురియాలని వరుణుడిని చేతులెత్తి మొక్కుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈ వానకాలం లో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 38.4 మి ల్లీమీటర్లు కాగా సాధారణానికి మించి 151శాతం అధికంగానే 106 మిల్లీ మీటర్ల నమోదవ్వడం గమనార్హం. సీజన్ తొలివారంలో కురిసిన భారీ వర్షాలు సాధారణానికి మించి కనిపిస్తున్నా నాడు నాటిన వి త్తనాలు మొలకెత్తే పరిస్థితులు ప్రస్తుతం ప్రశ్నార్థకం గా మారాయి. పత్తి విత్తనాలు మరోవారం రోజుల్లో వర్షాల కురిస్తే మొలకెత్తే పరిస్థితులు ఉన్నాయి. వరి నారు జూలైలో పోసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా రాబోయే మూడు, నాలుగు రోజు ల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ చేస్తున్న ప్రకటనలే రైతులకు ఆశలు చిగురింపజేస్తుండగా ప రిస్థితులు, వాతావరణం మాత్రం ఆ దిశగా కనిపించడం లేదు.
జిల్లాలో రైతులు అ ధికంగా 90వేల ఎకరాల్లో పత్తి విత్తనాలను నాటారు. విత్తనాలు వేసిన రైతులు గుంటుకలు కొట్టి రక్షించుకోవాలి. అలాగే నీటి బోర్లు, కాల్వల్లో నీటి వనరు లు ఉంటే నీళ్లను స్ప్రింక్లర్ల ద్వారా అం దించుకోవాలి. వచ్చే వారం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నాయి. వరి పంట నారును జూలైలో పోసుకోవాలి. మంచిగా వర్షాలు కురిశాకే రైతులు విత్తనాలు నాటుకోవడం మంచిది.