మహబూబ్‌నగర్ విద్యావిభా గం, అక్టోబర్ 6 : ఈ నెల 5వ తేదీ వరకే డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ముగిసిందని అధికారులు ప్రకటించారు. అయితే, ఆదివారం ‘నమస్తే తె లంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘పరిశీలన.. పరేషాన్’ కథనంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. నిర్దేశిత గడువు ముగిసినా ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 20 పోస్టుల భర్తీకి జాబితా రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ఎంతో కష్టపడి చదివి చేతికాడికి వచ్చిన ప్రభు త్వ ఉద్యోగం రాదేమోనని అభ్యర్థులకు నిరాశ ఎదురైంది.
ఈ నేపథ్యంలో అభ్యర్థుల అవస్థలు, ఆవేదన, ఆందోళనను ‘నమస్తే తెలంగాణ’ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. మొదట కోర్టు కేసు ఉందనే సాకును బూచీగా చూపినా.. ఎట్టకేలకు ఎస్జీటీ స్పె షల్ ఎడ్యుకేషన్ అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో పొందుపర్చారు. 20 పోస్టులకుగానూ 39 మం ది అభ్యర్థులను ఆదివారం జిల్లా అధికారులు ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కావడంతో ‘నమస్తే’కు కృతజ్ఞతలు తెలిపా రు. అయితే, ఏజెన్సీ గిరిజనులకు న్యా యం చేయాలని ఏజెన్సీ ఏరియా గిరిజ న హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు జైపాల్‌నాయక్ డిమాండ్ చేశారు.
ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కావడంతో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చే సి ఈ నెల 9వ తేదీన నియామక పత్రా లు అందజేయనున్నారు. దసరా సెలవుల తర్వాత కొత్త ఉపాధ్యాయులు వి ధుల్లో చేరనున్నారు. దీనికి తోడు 2008 డీఎస్సీలో అర్హత సాధించి పలు కారణాలతో నష్టపోయిన వారికి ఎస్జీటీలుగా నియమించే ప్రక్రియ కూడా చేపడుతున్నారు. దీంతో ఉపాధ్యాయుల కొరత చాలా వరకు తీరనున్నది.