మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 19: మహబూబ్‌నగర్ కలెక్టర్‌ను కాంగ్రెస్ నాయకుడు జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అసభ్యకరంగా దుర్బాషలాడినందుకు వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీఈజేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్‌రెడ్డి నాయకత్వంలో ఎస్పీ నర్సింహకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలోని ఆయన చాంబర్లో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వెళ్లి కలిశారు. మంగళవారం బాలానగర్ మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు జనంపల్లి అనిరుధ్‌రెడ్డి కలెక్టర్ రవినాయక్, బాలానగర్ తాసీల్దార్‌ను ఉద్దేశించి దుర్బాషలాడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. కలెక్టర్‌ను ఈ విధంగా సంబోధించడంతో జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వెంటనే అనిరుధ్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు యొక్క కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఫిర్యాదుపై ఎస్పీ స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకుంటామని, చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎస్పీని కలిసిన వారి ఉన్నారు.
‘అనిరుధ్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి’
కలెక్టర్‌పై దుర్బాషలాడిన కాంగ్రెస్ నాయకుడు అనిరుధ్‌రెడ్డి వెంటనే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ మండల ప్రెసిండెంట్ బాలూనాయక్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బుధవారం గిరిజన సర్పంచులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో సింగిల్ విండో డైరెక్టర్ మంజూనాయక్, సర్పంచులు తిరుపతినాయక్, గోపినాయక్, రమేశ్ నాయక్, ఖలీల్, బీఆర్ఎస్ నాయకులు జగన్నాయక్, శ్రీనివాసులు, పురందాస్నాయక్, రేడ్యానాయక్, రతన్, గోపినాయక్ తదితరులు ఉన్నారు.
నవాబ్‌పేట మండల నాయకులు
కలెక్టర్‌ను తీవ్ర పదజాలంతో దూషించిన కాంగ్రెస్ నాయకుడు అనిరుధ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు బుధవారం ఎస్పీ నర్సింహను కలిసి వినతి పత్రం అందజేశారు.
‘కేసు నమోదు చేయాలి’
కాంగ్రెస్ నాయకుడు అనిరుధ్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బుధవారం లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అనిరుధ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాలానగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో అనిరుధ్‌రెడ్డి కలెక్టర్ రవినాయక్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడారని, అయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారిపై ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ అధిష్టానం అనిరుధ్‌రెడ్డిపై చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. అనంతరం అనిరుధ్‌రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి చందర్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్, రవిందర్‌నాయక్, భగవాన్‌నాయక్, రాజునాయక్, నర్సింహనాయక్, తరుణ్‌నాయక్, లింబ్యానాయక్, లక్ష్మణ్‌నాయక్, తులససీ రామ్‌నాయక్, జాన్యనాయక్ రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
‘పాదయాత్రను అడ్డుకుంటాం’
గిరిజన కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి అనురుధ్‌రెడ్డి వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఉమ్మడి జిల్లా లంబాడి ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్‌కు క్షమాపణ చెప్పకపోతే పాదయాత్రను అడ్డుకుంటామన్నారు. సమావేశంలో లంబాడి ఐక్యవేదిక ఉమ్మడి మండల సమన్వయకర్త శంకర్‌నాయక్, నాయకులు రాందాసు, బద్రీలాల్, విజయ్‌నాయక్, శ్రీనునాయక్, గణేశ్‌నాయక్, సతీశ్నాయక్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలి
కలెక్టర్‌పై కాంగ్రెస్ నాయకుడు అనిరుధ్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కలెక్టర్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జడ్చర్ల బీఆర్ఎస్ ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు శ్రీనునాయక్ బుధవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజాహిత పాదయాత్రను గిరిజన సంఘాలు అడ్డుకుంటాయని హెచ్చరించారు.
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి
కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనిరుధ్‌రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన సంఘం నాయకులు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈకార్యక్రమంలో గిరిజన ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.