మహబూబ్‌నగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న ఐటీ ఇండస్ట్రియ ల్ పార్కుకు విదేశాల కంపెనీలు క్యూ కడుతున్నాయని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఓ దిగ్గజ కంపెనీ తమ కార్యాకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చిందని ఆయ న స్పష్టం చేశారు. ఐటీటవర్‌ను మంత్రి, కలెక్టర్ రవినాయక్, అడిషనల్ కలెక్టర్ సీతారామారావుతో కలిసి ఐటీ, ఎనర్జీటిక్ పార్కు టవర్‌ను శుక్రవారం పరిశీలించారు. సకాలంలో పనులు పూర్తి చేసినందుకు కాంట్రాక్టర్‌ను అభినందించారు. లైటింగ్, అప్రోచ్ రోడ్డు, ప్లాంటేషన్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అనంతరం హైవే వరకు చేపట్టే రహదారి స్థలాన్ని పరిశీలించా రు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అ మెరికా, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడకు వస్తున్నాయన్నారు. విదేశాల్లో పనిచేస్తున్న పాలమూరువాసులంతా ఇక్కడ ఉద్యోగాలు చేసేలా ఐటీ టవర్‌ను తీర్చిదిద్దుతామన్నారు. స్థానిక యువతకు కూడా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు పొందేలా ప్రోత్సహిస్తామన్నారు. ఐటీ కంపెనీ ఎనర్జీ పార్కు కోసం సుమారు 4వందల ఎకరా ల భూమిని సేకరించామన్నారు. అసైన్డ్ భూములు అ యినప్పటికీ పట్టా భూముల్లాగా ఎకరాకు మార్కెట్ రే టుకన్నా రూ.లక్ష ఎక్కువ పరిహారం ఇచ్చి రైతులకు ఇ బ్బందులు లేకుండా చేశామన్నారు. మే 6న ఐటీ టవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్నారని.. అప్పటిలోగా పనులు పూర్తి చేయాలని టీఎస్ఐఐసీ అధికారులను ఆ దేశించారు. వచ్చే మూడేండ్లల్లో కనీసం ముప్పైవేల ఉ ద్యోగాలు లభించేలా చూస్తామన్నారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ రవి, నాయకులు పాల్గొన్నారు.
ఎదిరలో ఇంటికో ఉద్యోగం
మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 21: మహబూబ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు ఏరిపారేసినట్టున్న ఎది ర.. ఇప్పుడు అందరికీ అసూయ కలిగేలా అభివృద్ధి చెం దిందని.. క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎదిర 4వ వార్డులో రూ.5లక్షలతో నిర్మించిన ఈద్గాను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎదిరలో ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామ ని, చదువును బట్టి కనీసం రూ.25వేల నుంచి రూ.లక్ష జీతం పొందేలా అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని ర కాల అభివృద్ధి పనులు చేపట్టి ఎదిరకు సరికొత్త రూపు తీసుకొచ్చామన్నారు. గ్రామంలో ఉన్న 42మంది కురుమలకు ఉచితంగా ప్రభుత్వ ప్లాట్లు ఇచ్చామన్నారు. ఐటీ పార్కులో ప్రభుత్వ భూమి కోల్పోయిన వారికి రూ. 12లక్షలు ఇప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. మైనార్టీల కోరిక మేరకు 40 రోజుల్లోనే ఈద్గా నిర్మాణం చేట్టామన్నారు. స్వార్థపరులు చేసే రాజకీయాలను ఎవరూ నమ్మొద్దని సూచించారు. మే 6న ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని.. అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు చెందిన కంపెనీలను ఏర్పాటు చేయబోతున్నారని చెప్పారు. అనంతరం మంత్రిని గ్రామస్తులు ఘ నంగా సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, కౌన్సిలర్ యాదమ్మ, మజీద్కమిటీ అధ్యక్షుడు అబ్దుల్హకీం, గ్రామపెద్దలు, నాయకులు నజీరుద్దీన్, ఖలీల్, అజీజుల్లా, హన్మంతు, నర్సింహులు, ఎల్లయ్య, వెంకటయ్యగౌడ్, శేఖర్, నర్సింహ, వివిధ సంఘాల నాయకులు, మసీద్కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
190 కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు
పాలమూరు, ఏప్రిల్ 21: మహబూబ్‌నగర్ జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. తూకం లో చిన్న తేడా వచ్చిన కఠిన చర్యలు తీసుకుంటామన్నా రు. రైతులను మోసం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశా రు. జిల్లాలో 190 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని.. రైతులకు అన్ని వసతులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. దేశంలో రైతుల నుంచి ధా న్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నా రు. ఒకప్పుడు ధాన్యం ఉత్పత్తిలో సమైక్య ఏపీ 23వ స్థానంలో ఉండగా.. తెలంగాణ ఇప్పుడు దేశంలో మొదటిస్థానంలో నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ మ న్నె శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, డీసీసీబీ వైస్‌చైర్మన్ వెంకటయ్య, జెడ్పీ వైస్‌చైర్మన్ కొడుగల్ యాదయ్య, మార్కెట్‌కమిటీ చైర్మన్ రహమాన్, ఆర్డీవో అనిల్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు.
కానుకలు పంపిణీ
మహబూబ్‌నగర్ టౌన్, ఏప్రిల్ 21 : పాలమూరులోని తూర్పు కమాన్ వద్ద ఉన్న జామియా మసీదులో రంజా న్ సందర్భంగా ఇమామ్, మౌజంలకు దుస్తులు, నిత్యావసర సరుకులు, కానుకలను మంత్రి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీలు అధికంగా ఉన్న కశ్మీర్లో కూడా తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలు లేవన్నారు. మైనార్టీ విద్యార్థుల కోసం జిల్లాకేంద్రంలో గురుకులాలు, కళాశాలలు ఏర్పాటు చే శామని.. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.1.25లక్షలు ఖ ర్చు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్ రహమాన్, జామియా మసీదు కమిటీ అధ్యక్షు డు అహ్మద్సన, నాయకులు పాల్గొన్నారు.