గద్వాల అర్బన్, మే 5: కమీషన్‌దారుల నుంచి ఓ ఖరీదుదారుడు ధాన్యం తీసుకొని తీరా వారికి డబ్బులు చెల్లించకుండా ఐపీ పెట్టిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకోవడం కలకలం రేగుతుం ది. బాధితుల వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలో ని మార్కెట్ యార్డ్‌లోని ఓ ఖరీదుదారుడు ఆయా కమీషన్‌దారుల దుకాణాల్లోకి వెళ్లి రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఖరీదు చేసినట్లు సమాచారం. వాస్తవానికి ధాన్యం ఖరీదు చేసిన అనంతరం 7నుంచి 14రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. కానీ సదరు ఐపీ పెట్టిన ఖరీదుదారుడు నెలల గడుస్తున్నా కమీషన్‌దారుల నుంచి తీసుకున్న ధాన్యం డబ్బులు చెల్లించకుండా మాటలు చెబుతూ కాలంగడిపాడు. డబ్బులు రాకపోవడంతో కమీషన్‌దారులు తమ వ్యాపారం దెబ్బతింటుందని గ్రహించి తమ డబ్బులు చెల్లించాలని ఖరీదుదారుడిపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది.
ఈ క్రమంలో సదరు ఖరీదుదారుడు నారాయణపేట జిల్లా మార్కెట్ యార్డ్‌లో కూడా కమీషన్‌దారుల నుంచి ధాన్యం తీసుకొని డబ్బులు చెల్లించకుండా తిరుగుతున్నడాని వారు డబ్బులు చెల్లించాలని వత్తిడి చేసినట్లు సమాచారం. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కూడా కమీషన్‌దారుల దగ్గర కూడా ధాన్యం తీసుకుని డబ్బులు చెల్లించలేక పోవడంతో సదరు కమీషన్‌దారుల ఫిర్యాదు మేరకు మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులను ఆశ్రయించడంతో వారు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సమాచా రం.
పక్క రాష్ట్రంలోని రాయిచూర్ జిల్లాలో కూడా సదరు ఖరీద్దారుడు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించేది ఉందని స్థానికుల ద్వారా తెలిసింది. గద్వాల మార్కేట్ యార్డ్‌లోని కమీషన్దారులతోపాటు అన్ని దగ్గర రూ.4కోట్లకు పైగా ఐపీ పెట్టి తనకు డ బ్బులు ఇవ్వాలని వత్తి డి చేసిన వారికి కోర్టు నుంచి నోటిసులి వ్వడంపై కమీషన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం 20 రోజుల నుండి జిల్లా కేంద్రంతోపాటు మహబూబ్‌నగర్, నారాయణపేట, కర్ణాటకలోని రాయచుర్ జిల్లా లో కమీషన్‌దారులు చర్చించుకోవడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వాస్తవానికి మార్కెట్ యార్డ్‌లో రైతులు తీసుకొచ్చిన అనంతరం కమీషన్‌దారుల నుంచి ఖరీద్దారులు ధాన్యంను తీసుకుంటారు. రైతులకు తక్షణమే కమీషన్‌దారులు డబ్బులు చెల్లిస్తారు. కమీషన్‌దారుల నుంచి ధాన్యం తీసుకున్న ఖరీదు దారులు 7 నుంచి 14 రోజుల గడువులో డబ్బులు చెల్లించాలి. లేని పక్షంలో అందుకు తగ్గ ట్లు వడ్డీతో కలిపి డబ్బులు చెల్లించాలి. ఆ విధం గా మార్కెట్లో ని బంధనలు పెట్టుకున్నట్లు తెలిపారు.
కానీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వకుండా ఇలా చేయడం ద్వారా కమీషన్‌దారులు పెద్ద మొత్తంలో నష్టపోతారు. వారి వ్యాపారం దెబ్బతింటుంది. వ్యాపారం దెబ్బతింటే వ్యా పా రం చేసే వారు లేకపోతే రైతులకే పెద్ద నష్టం. ఇలా ఉన్న ఫలంగా ఐపీలు పెడితే తమ ప రిస్థితి ఏంది అంటు.. ఇప్పటికే కమీషన్‌దారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం చొరవ తీ సుకుని కమీషన్‌దారులకు న్యాయం జరిగే విధం గా చూడాలని కోరారు.
– మహేశ్వర్‌రెడ్డి, గద్వాల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు