నాసిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
నాణ్యత లేని నాసిరకం విత్తనాలు, ఎరువులు రైతులకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ హెచ్చరించారు. కలెక్టరేట్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువుల డీలర్లు, వ్యవసాయ అధికారులతో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ పలు సూచనలు చేశారు.
- వనపర్తి కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్
వనపర్తి, మే 25 : నాణ్యత లేని నాసిరకం విత్తనాలు, ఎరువులు రైతులకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ హెచ్చరించారు. కలెక్టరేట్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువుల డీలర్లు, వ్యవసాయ అధికారులతో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు లాభదాయక వ్యవసాయ చేసేందుకు వ్యవసాయ అధికారులు, డీలర్లు సరైన సలహాలు,సూచనలు ఇచ్చి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వాడే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఆధారిత ఎరువులు, పచ్చరొట్ట, చెరువు మట్టి వంటి ఎరువులు అధికంగా వాడి భూసారం పెంచే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రతి డీలర్ల షాప్‌లో స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్ రైతులకు ఎరువుల సరఫరా రిజిస్టర్లు విధిగా నిర్వహించాలన్నారు. అనంతరం సదస్సులో జిల్లా వ్యవసాయశాఖాధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ దళారులు రైతుల వద్దకు వచ్చి తక్కువ ధరకు మేలు రకం విత్తనాలు ఇస్తామని ప్రచారం చేస్తుంటారని, ఇలాంటి వారిని రైతులు నమ్మవద్దని సూచించారు. విత్తన ప్యాకెట్స్ పై లేబుల్ లేకుండా ,ప్యాకింగ్ లేకుండా ఉన్న విత్తనాలను తీసుకొవద్దని ఎక్కడైనా ఇలాంటి వారు వస్తే వెంటనే కేసులు బుక్ చేయించాలన్నారు. ప్యాకెట్ సరిగ్గా లేకున్న లేబుల్స్‌లో తేడా కనిపించినా వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. బీటీ-3 పత్తి విత్తనాలను వాడకుండా చర్యలు తీసుకొవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, వ్యవసాయ ఏడీలు, ఏవోలు, ఏఈవోలు, డీలర్లు పాల్గొన్నారు.
ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి
ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ ఆదేశించారు. శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి ధరణి దరఖాస్తుల పరిష్కారం పురోగతిని ఆన్లైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాసీల్దార్లు ఆర్డీవో లాగిన్ వచ్చిన ధరణి దరఖాస్తులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు కలెక్టర్ లాగిన్‌కు పంపించాలని, పెండింగ్‌లో పెట్టవద్దని సూచించారు.
అదేవిధంగా కలెక్టరేట్ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో యాసంగి సీజన్ 2020-21, వానకాలం 2021-22లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం ఎఫ్‌సీఐకి నిర్ణీత గడువులోపు అందించాలని మిల్లర్లను ఆదేశించారు. ధాన్యాన్ని ఎఫ్‌సీఐలకు సకాలంలో ఇవ్వనందున తీసుకున్న ధాన్యానికి సంబంధించి ప్రభుత్వానికి డబ్బులు జమ చేయాలని, లేకపోతే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. అలాగే 2022-23, 2023-24కు సంబంధించి మిల్లర్ల నుంచి ఇవ్వాల్సిన ధాన్యం యుద్ధ ప్రాతిపదికన ఎఫ్‌సీఐకి అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.నగేశ్, సివిల్ సైప్లె అధికారి శ్రీనివాస్, మిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

