గాండీడ్ : మహబూబ్నగర్ జిల్లా గాండీడ్ మండలం వెన్నాచెడ్ గ్రామంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు ( Tractors ) , జేసీబీని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ( Collector Vijayendra Boi ) సీజ్ చేయించారు. శనివారం వెన్నాచెడ్ గ్రామ పరిధిలోని సాయిరాం ఫంక్షన్ హాల్లో భూభారతిపై అవగాహన సదస్సులో పాల్గొనేందుకు గ్రామానికి వచ్చారు.
అనంతరం వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసేందుకు వెళ్తుతుండగా అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఎనిమిది ట్రాక్టర్లు అటుగా వచ్చాయి. దీంతో వాటిని ఆపి మట్టిన ఎక్కడికి తరలిస్తున్నారని ప్రశ్నించగా సరైన సమాధానం రాకపోవడంతో వాటిని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ట్రాక్టర్లను పోలీసు స్టేషన్కు తరలించారు. జేసీబీ మరొకకొన్ని ట్రాక్టర్లు అక్కడి నుంచి తప్పించుకోగా వాటి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.