మహబూబ్‌నగర్, అక్టోబర్ 20 : ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల సామగ్రిని పంపిణీ కేంద్రాలను పక్కాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్, ఎన్నికల అధికారి జి.రవినాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల, స్టేడి యం మైదానాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలుగా గుర్తించే అన్ని సంస్థల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించి సూచన లు, మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ కే్ంర దాలు ఉండాలన్నారు. ఎన్నికల సామగ్రిని తరలించే వాహనాలు, సిబ్బంది వాహనాలు సులభంగా వచ్చి వెళ్లేలా సరైన పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ రిటర్నింగ్ అధికారి, అనీల్‌కుమార్, అర్బన్ తాసీల్దార్ నాగార్జున, ఆర్ఐ చైతన్య, ఈఈ నరేందర్‌రెడ్డి, దేవరకద్ర రిటర్నింగ్ అధికారి నటరాజ్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రవీంద్రనాథ్, దేవరకద్ర తాసీల్దార్ బ్రహ్మంగౌడ్, డీవైఎస్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సీ-విజిల్ యాప్ ఎన్నికల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నదని కలెక్టర్ రవినాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో కలిసి సీ-విజిల్ యాప్‌నకు సంబంధించిన ప్రచార వాల్‌పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో సీ-విజిల్, 1950, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ముఖ్యంగా డబ్బు, మద్యం పంపిణీ కానుకల పంపిణీ, ఓటర్లను బెదిరించడం, తప్పుడు వార్తలను ప్రసారం చేసిన విద్వేశపూరిత ప్రసంగాలపై సీ-విజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యాంత్రాల గోదాంలో నిర్వహించిన ఈవీఎం ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ రవినాయక్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు.