కృష్ణ, జనవరి 18 : మన ఊరు-మన బడి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మండలంలోని హిందూపూర్, గుడెబల్లూర్తోపాటు పలు పాఠశాలల్లో చేపడుతున్న పనులను, మధ్యా హ్న భోజనాన్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. మురహరిదొడ్డి ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అంతకుముందు మండలకేంద్రంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులపై ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంఈవో లక్ష్మీనారాయణ, సర్పంచులు, ప్రజాప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
ఊట్కూర్, జనవరి 18 : ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు-మన బడి కింద అన్ని వసతులను సమకూర్చాలని ఎంపీడీవో కాళప్ప సూచించారు. మండలంలోని పెద్దపొర్ల ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న టాయ్‌లెట్ నిర్మా ణ పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకోవాలని గుత్తేదారును ఆదేశించా రు. కార్యక్రమంలో పీఆర్ ఏఈ జగత్‌చంద్ర పాల్గొన్నారు.