మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 5 : ప్రజావాణికి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాల ని కలెక్టర్ జీ రవినాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిలో పరిష్కరించే సమస్యలపై కూడా ప్రజలు కలెక్టర్‌కు వచ్చి ఫి ర్యాదులు చేస్తున్నారని, మండల స్థాయిలో ఎందుకు పరిష్కరించడం లేదని అధికారుల ను ప్రశ్నించారు. మండల స్థాయిలో అధికారులు ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, స్పెషల్ కలెక్టర్ జ్యోతితోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద జిల్లాలోని అన్ని గ్రామాల్లో లబ్ధిదారులను నమోదు చేయించాలని కలెక్టర్ జీ రవినాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుల వృత్తుల వారిని గుర్తించి వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి వారి జీవనోపాధి పెంపొందింప జేయాలన్న ఉద్దేశంతోనే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటికీ పలు గ్రామాల్లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేయడం జరిగిందని, అన్ని గ్రామాల్లో కూడా నమోదు చేయించాలన్నారు. అనంతరం ఎంఎస్ఎం ఈ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం విధివిధానాలను వివరించారు. అదేవిధంగా ఈనెల 13న ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంక్ పాస్ బుక్ సమర్పిస్తే సరిపోతుందని ఆయన వివరించారు.
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 5 : జడ్చర్ల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని మున్సిపల్ కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్ట ర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ము న్సిపల్ కౌన్సిలర్లు చైతన్యచౌహాన్, శశికిరణ్ కలెక్టర్ రవినాయక్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ము న్సిపాలిటీ పరిధిలోని ఇండ్ల నిర్మాణ అనుమతులు, వెంచర్లలో ప్రభుత్వ స్థలాల మార్టిగేజ్, ట్రేడ్ లైసెన్సులు అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్టీసీ బ స్టాండ్ పరిసరాల్లో రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా టీస్టాల్స్, టిఫిన్ సెంటర్లు, మెకానిక్ షాపులు, డబ్బాలు ఏర్పాటు చేయడంలో అక్రమాలు జరుగుతున్నాయని వీటిపై విచారణ నిర్వహించాలని కో రారు. కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుకు మద్దతుగా తమతోపాటు కౌన్సిలర్లు శ్రావణి, చైతన్యగౌడ్, శ్రీశైలమ్మ, కోనేటి పుష్పలత సంతకాలు చేసినట్లు వారు తెలిపారు.