కొల్లాపూర్ : పెద్దకొత్తపల్లి మండలంలోని చంద్రబండ తండా గ్రామంలో గురువారం కేతావత్ లాలి అనే బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కును(CMRF cheque ) గ్రామ సర్పంచ్ కేతావత్ చిట్టి శంకర్, ఉప సర్పంచ్ కేతావత్ శంకర్ నాయక్ గురువారం అందజేశారు. లాలి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నాగర్కర్నూల్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందింది.
బాధిత కుటుంబ సభ్యులు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడంతో అక్కడి నుంచి మంజూరై వచ్చిన రూ.30వేలు మంజూరు అయినట్లు సర్పంచ్ చిట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ కేతావత్ హేమ్లా నాయక్, నాయకులు కేతావత్ గేమ్యా నాయక్, కేళావత్ తిరుపతయ్య నాయక్, కేతావత్ లాల్యా నాయక్, జరుపుల శక్రు నాయక్, కేతావత్ భాస్కర్ నాయక్, మూడావత్ బాలు, కోడావత్ రమేష్ నాయక్, కేతావత్ వేణుగోపాల్ నాయక్, జరుపుల నరేష్ నాయక్, కేతావత్ హరిసింగ్ నాయక్, కేతావత్ ప్రసాద్ నాయక్ , కేతావత్ బాలాజీ నాయక్, పాత్లావత్ సంతోష్ నాయక్, కేతావత్ శివుడు నాయక్, కేతావత్ సాయికుమార్ నాయక్, కేతావత్ జగ్గి నాయక్ తదితరులు పాల్గొన్నారు.