కల్వకుర్తి, జూలై 27 : సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం కల్వకుర్తిలో పర్యటించనున్నారు. కొట్ర గేట్ వద్ద మాజీ మంత్రి దివంగత జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణతోపాటు కల్వకుర్తి లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి అధికారు లు, పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం ఆయన పర్యవేక్షించారు. అనంతరం కల్వకుర్తి తాసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయం పక్కన నిర్వహించే బహిరంగ సభకు పోలీసులు పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలన్నారు. అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతగా నిర్వహించాలని సూచించారు. సీఎం ప ర్యటన ప్రదేశాల్లో అవసరమైన బారికేడ్లు, శానిటేషన్, పచ్చదనం, బయో టాయిలెట్స్ వంటి ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు చూసుకోవాలని చెప్పారు. అనంతరం ఎస్పీ గైక్వాడ్ సీఎం భద్రతా సిబ్బందితో కలిసి బహిరంగ సభ, విగ్రహావిష్కరణ స్థలాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సీతారామారావు, అదనపు ఎస్పీ భరత్, ఆర్డీవో శ్రీను, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
వెల్దండ, జూలై 27 : వెల్దండ మండలం కొట్ర గేట్ వద్ద మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి.. కలెక్టర్ సంతోష్, ఐజీ సత్యనారాయణ, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో గోపాల్, ఎంపీడీవో సత్యపాల్‌రెడ్డి, తాసీల్దార్ రవికుమార్ తదితరులు ఉన్నారు.