ఊర్కొండ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల సందర్భంగా మాదిగలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఊర్కొండ మండల కేంద్రంలో జరిగిన ఎమ్మార్పీఎస్ దీక్షలో జిల్లా నాయకులు గుడిగానిపల్లి రాజు మాదిగ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే SC వర్గీకరణకు చట్టం చేయాలని, 30 ఏండ్ల పోరాటం చేసిన SC కులాల్లో ఉన్న 59 ఉపకులాలకు జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేసినప్పుడే నిజమైన న్యాయం జరుగుతుందని అన్నారు.
ఎస్సీ కులాలను A, B, C, D గ్రూపులుగా విభజన చేయాలనీ, రాష్ట్ర మంత్రివర్గంలో రెండు మాదిగలకు కేటాంచాలని, SC వర్గీకరణ సూత్రాన్ని పాటించి ఉద్యోగ నియామకాలు భర్తీ చేయాలనీ ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మాదిగ కళాకారుల సంఘం మండల అధ్యక్షులు ఎర్రశయని పరమేష్ మాదిగ, MRPS మండల నాయకులు కొమ్ము శ్రీను మాదిగ, చందు మాదిగ, ఆంజనేయులు మాదిగ, చిన్న రాజు మాదిగ, ధార జంగయ్య మాదిగ, జగన్ మాదిగ, భాస్కర్ మాదిగ, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.